»   » పోటెత్తిన ఫ్యాన్స్: కొల్లేరులో ఉపాసన, రామ్ చరణ్ కదలలేని పరిస్థితి!

పోటెత్తిన ఫ్యాన్స్: కొల్లేరులో ఉపాసన, రామ్ చరణ్ కదలలేని పరిస్థితి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు మంగళవారం కైకలూరు మండలం కొల్లేటికోట రోడ్డులో సర్కార్‌ కాల్వ వంతెనపై షూట్ చేసారు. ఈ షూటింగును రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తిలకించారు.

సర్కార్‌ కాల్వ వంతెనపై బైక్‌కు ఆయిల్‌ ఇంజన్‌ను కట్టుకుని వ్యవసాయ పనుల కోసం వెళుతున్న సన్నివేశాలను చిత్రీకరించారు. రామ్‌చరణ్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు.

సర్పైజ్ అయిన రామ్ చరణ్

అభిమానులు ఒక్కసారిగా పొటెత్తడంతో సర్పైజ్ అయ్యాను. వారు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే.... రామ్ చరణ్ తన ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేసారు.

పల్లెటూరి నేపథ్యం

పల్లెటూరి నేపథ్యం

పల్లెటూరి నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, కొల్లేరులో చిత్రషూటింగ్ చేయడం బాగుందని, ఇక్కడ ప్రదేశం షూటింగ్ చేసేందుకు అనువుగా ఉందన్నారు దర్శకుడు సుకుమార్. తాను గోదావరి జిల్లాకు చెందిన వాడినైనా కొల్లేరు ఖ్యాతిని వినడమే కాని, ఎప్పుడూ చూడలేదని అన్నారు. హీరో రామ్ చరణ్ లాంటి స్టార్ మూవీ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కాబట్టి తెలుగు సినీ ప్రేక్షకులకు చూపు మరోసారి కొల్లేరువైపు పడుతుందన్నారు.

రామ్ చరణ్ లీక్ ఫోటోస్

రామ్ చరణ్ లీక్ ఫోటోస్

తన సినిమాలో రామ్ చరణ్ ను ఓ డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడు సుకుమార్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.

రామ్ చరణ్, సుకుమార్

రామ్ చరణ్, సుకుమార్

రామ్ చరణ్ సుకుమార్ మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

English summary
"Fans surprised me today on sets to say a big hello! Overwhelmed by the love 🙏🏻 #touched" Ram Charan said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu