రచ్చ రచ్చ చేసారు : పవన్ కళ్యాణ్ పై (వీడియో)
హైదరబాద్: అక్కడ రజనీకాంత్..ఇక్కడ పవన్ కళ్యాణ్...వీరిద్దరి అభిమానుల అభిమానం పట్టలేం. అందులోనూ ఈ మధ్యన వరసగా గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సూపర్ హిట్ అవటంతో వారి ఆనందానికి అవధులే లేవు. దాంతో వారు ఉత్సాహంగా వారు పవనిజం ను మరింత ఉత్సాహంగా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా...వారు ఓ పాటను చిత్రీకరించి విడుదల చేసారు. ఈ క్రింద ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/80sLYeODE3Y" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇక రీసెంట్ గా పవనిజం జరుపుకోవటానికి అక్టోబర్ 11న ఓ వరల్డ్ పవనిజం డే గా ప్రకటించారచు. ఎన్నో వీడియోలు పవనిజం మీద వచ్చినా..వస్తున్నా ఈ వీడియోకు వస్తున్న ఆదరణ చాలా బాగుంది. పవన్ అభిమానులంతా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు.

మరో ప్రక్క పవన్ అభిమానులు కొందరు పవనిజం టైటిల్ తో సినిమాని రెడీ చేసి విడుదల చేస్తున్నారు. మధు, సుధీర్, ఇషా, జయంతి హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'పవనిజం'. ఇ.కె.చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్, నరేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని వచ్చే నెల 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
దర్శకుడు మాట్లాడుతూ ''పవన్‌కల్యాణ్ అభిమానుల కథ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అభిమానులు తలచుకొంటే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇందులో చూపించాం'' అన్నారు. ''ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం. పవన్ అభిమానులకే కాకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు నిర్మాతలు.


Click it and Unblock the Notifications