Radheshyam: ముందే లీక్ చేస్తున్న దర్శకుడు.. అలాంటిది లేదనడంతో ఫ్యాన్స్ అప్సెట్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత విడుదలవుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ పై రోజురోజుకు అంచనాలు ఆకాశాన్ని దాటిపోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త లుక్ తో ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ముఖ్యమైన పాత్రలో ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం పై దర్శకుడు ముందే క్లారిటీ ఇవ్వడంతో ఒక వర్గం అభిమానులు చాలా అప్సెట్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో..

భారీ బడ్జెట్ తో..

బాహుబలి, సాహో సినిమాల అనంతరం ప్రభాస్ వీలైనంత త్వరగా రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఈ సినిమాకు కూడా చాలా ఆలస్యం అయ్యింది. కేవలం షూటింగ్ పరంగానే కాకుండా కరోనా వల్ల కూడా సినిమా పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే యూవీ క్రియేషన్స్ మాత్రం ఈ సినిమాతో ఒక డిఫరెంట్ విజువల్ ట్రీట్ ఇవ్వాలి అని ఖర్చు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాదాపు 300కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు టాక్.

అలా సెట్టయిన కథ

అలా సెట్టయిన కథ

దర్శకుడు రాధాకృష్ణ కథను దాదాపు పదిహేను ఏళ్ళ క్రితమే విన్నాడట. తన గురువు అయినటువంటి చంద్రశేఖర్ యేలేటి నుంచి ఈ కథను తీసుకున్న రాధాకృష్ణ తనదైన శైలిలో కొన్ని మార్పులు చేసుకొని స్క్రిప్టును రెడీ చేసుకున్నాడట. ఇక ఈ కథ గురించి తెలుసుకున్న ప్రభాస్ ఎలాగైనా సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకురావాలని యు.వి.క్రియేషన్స్ తో చేతులు కలిపాడు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చాలా బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

సినిమా ఎలా ఉంటుంది?

సినిమా ఎలా ఉంటుంది?

ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది? ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు? అని ఎన్నో అంశాలు ప్రేక్షకులలో అంచనాల స్థాయిని పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. విధికి ప్రేమకు మధ్యలో కొనసాగే యుద్ధమే రాధేశ్యామ్ అని దర్శకుడు కూడా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ కధ ఆ అంశం మీద ఎలా సాగుతుంది అనేది చాలా ఆసక్తిని కలిగిస్తోంది.

ట్రాజిక్ ముగింపు

ట్రాజిక్ ముగింపు

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాధాకృష్ణ మరొక విషయం పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ట్రైలర్ చూసిన తర్వాత అందరూ కూడా ఈ సినిమాలో హీరోయిన్ చనిపోతుంది అని అలాగే ప్రభాస్ కూడా మరణిస్తాడు అని అనేక రకాల పుకార్లు పుట్టించారు. ఒక విధంగా ట్రైలర్ లో కూడా హీరోయిన్ చనిపోతుంది అని ట్రాజిక్ ముగింపు కూడా ఉంటుందని అనేక కథనాలు వెలువడ్డాయి.

అలాంటి సందేహాలు

అలాంటి సందేహాలు

ఒక విధంగా అలాంటి రూమర్స్ సినిమాకు మంచి హైప్ ఐతే క్రియేట్ చేశాయి. ఇక దర్శకుడు ఏమనుకున్నాడో ఏమో తెలియదు గాని సినిమాలు మాత్రం ట్రాజిక్ ఎండింగ్ అయితే ఉండదు అని మరొకసారి వివరణ ఇచ్చాడు. అంటే పూజా హెగ్డే సినిమాలో చనిపోదా? కమర్షియల్ గానే సినిమాకు ముగింపు కార్డ్ పడుతుందా? అనే సందేహాలు చాలానే వస్తున్నాయి.

Recommended Video

Radhe Shyam : Prabhas Cults కి పండగ షురూ.. | Tollywood | Salaar | Filmibeat Telugu
లీక్ చేయకండి అంటూ..

లీక్ చేయకండి అంటూ..

అభిమానులు కూడా దర్శకుడు రాధాకృష్ణ ఇచ్చిన క్లారిటీ పై కొంత అప్సెట్ అవుతున్నారు. వచ్చిన సందేహాలపై ఇలా క్లారిటీ ఇచ్చుకుంటూ పోతే సినిమాపై ఆసక్తి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఒక విధంగా ఇది కూడా లీక్ లాంటిదే అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసే వరకు కథపై క్లారిటీ ఇవ్వకుంటే మంచిది అని ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమా లో ఉన్నట్లుగా అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X