twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR : హఠాత్తుగా నిలిచిన షో.. థియేట‌ర్ స్క్రీన్‌తో పాటు అద్దాలు ధ్వంసం.. పాపం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పల

    |

    ప్రపంచవ్యాప్తంగా RRR పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR సినిమా మార్చి 25 వ తేదీన పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుని అద్భుతమైన కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది.. అయితే ఈ సినిమా థియేటర్ల వద్ద కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక థియేటర్ ను అభిమానులు ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    450 కోట్ల రూపాయల బడ్జెట్ తో

    450 కోట్ల రూపాయల బడ్జెట్ తో

    దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన తాజా చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు.. ఇక రామ్ చరణ్ తండ్రి పాత్రలో అజయ్ దేవగన్ కనిపించగా ఎన్టీఆర్ స్నేహితుడి పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించారు.

    ఫ్యాన్స్ విధ్వంసం

    ఫ్యాన్స్ విధ్వంసం

    ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. కానీ కొన్ని చోట్ల ఫాన్స్ చూపిస్తున్న అత్యుత్సాహం కారణంగా చోటు చేసుకుంటున్నాయి. సినిమా విడుదల కూడా కాకముందే ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య చిత్తూరు జిల్లాలో గొడవ జరిగిన ఘటన మరవక ముందే విజయవాడ లోని అన్నపూర్ణ థియేటర్ లో ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు.

    అద్దాలు కూడా ధ్వంసం

    అద్దాలు కూడా ధ్వంసం


    విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ లో సాంకేతిక కారణాలతో RRR సినిమా నడుస్తూండగా ఆగిపోవడంతో ఫాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఎంత సేపటికి సినిమా వేయడం లేదు అని ఆరోపిస్తూ థియేటర్ సీట్లు, తెర కూడా ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. అంతేకాదు థియేటర్ అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ దెబ్బకు భయ పడిపోయే థియేటర్ యాజమాన్యం పోలీసులని పిలిపించగా వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కనిపించాయి.

    బాగు చేసి

    బాగు చేసి


    అయితే ఫ్యాన్స్ గొడవ చేయడంతో తెర చిరిగిపోయింది. అయినా సరే తెర బాగు చేసి ఆ తర్వాత ఆగిపోయిన సినిమా కంటిన్యూ చేసింది అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం.. థియేటర్ లో సినిమా అయిపోయిన వెంటనే ఫాన్స్ విధ్వంసానికి పాల్పడిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అయితే కొన్ని చోట్ల సాంకేతిక కారణాల నేపథ్యంలో సౌండ్ సిస్టం సరిగ్గా లేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    థియేటర్ మీద దాడి

    థియేటర్ మీద దాడి


    నిజానికి ఇలాంటి విషయాలు ఏమైనా జరుగుతాయని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం తెర వద్దకు వెళ్లకుండా మేకులు కొట్టిన చెక్కలు పెట్టించింది. తెర దగ్గరకు వస్తే అపాయం టు బోర్డులు కూడా పెట్టింది కానీ అదే థియేటర్లో సినిమా నిలిచిపోవడం వెంటనే ఫ్యాన్స్ కు ఆగ్రహం రావడంతో థియేటర్ మీద దాడి చేయడం జరిగిపోయింది.

    English summary
    Fans Vandalize Annapurna Theater in Vijayawada for interruption of screening RRR Movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X