For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ఒక్కటి చెప్పు చాలు!..: తట్టుకోలేకపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ!

  |
  పవన్..ప్లీజ్.. ఆ ఒక్కటి చెప్పు చాలు !

  రాజకీయాల్లోకి దూకుతున్నామంటే నాన్చుడు ధోరణి ఏమాత్రం పనికి రాదు. ఉంటే సీరియస్‌గా రాజకీయాల్లో ఉండాలి. లేదంటే.. అప్పటికే ఉన్న రంగంలో కొనసాగుతూనైనా ఉండాలి. చాన్నాళ్లుగా పవన్ కల్యాణ్ ఇదే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజాక్షేత్రంలో నాయకుడి పాత్రా?.. లేక వెండితెరపై హీరో పాత్రా?.. అన్నది ఇంకా ఆయన తేల్చుకోలేకపోతున్నారు.

  ఏంటా మర్మం?, వెన్నుపోటా? : పవన్‌ అంతలా డిస్టర్బ్ అవడం వెనుక!.. .

  అమాంతం పవన్ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్!: కొద్దిసేపు అంతా బ్లాంక్.., అదీ 'పవర్' గొప్పతనం

   అభిమానుల్లో బెంగ:

  అభిమానుల్లో బెంగ:

  అజ్ఞాతవాసి పవన్ కల్యాణ్‌కు చివరి సినిమా అన్న ప్రచారంతో ఆయన అభిమానుల్లో బెంగ మొదలైంది. ఏ ఇద్దరు పవన్ ఫ్యాన్స్ కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇటీవలి ఛలోరే.. ఛలో.. యాత్ర సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిచ్చాయి.

  అక్కడ కూడా ఇదే ప్రశ్న..:

  అక్కడ కూడా ఇదే ప్రశ్న..:

  శీతాకాలవిడిది కోసం హైదారాబాద్ విచ్చేసిన సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆత్మీయ విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  ఈ కార్యక్రమానికి సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, రానా, ఇతర సెలబ్రిటీలు,ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. వీళ్లలో కూడా కొంతమంది పవన్‌ను అభిమానించేవాళ్లు ఉండటంతో.. అజ్ఞాతవాసితోనే ఆపేస్తారా? అంటూ ఆయన వద్ద ఆరా తీశారట.

  ఇంకా నిర్ణయించకోలేదని..:

  ఇంకా నిర్ణయించకోలేదని..:

  అలా ఆరా తీసినవాళ్లకు పవన్ ఏమని సమాధానం చెప్పి ఉంటారో పక్కాగా తెలియదు కానీ.. ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన బదులిచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

  కాగా, 2019ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలన్న వ్యూహంతో ఉన్న పవన్.. సినిమాలకు సంబంధించి ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

  ఆ విమర్శలకు చెక్ పెట్టడానికే:

  ఆ విమర్శలకు చెక్ పెట్టడానికే:

  సినిమా-రాజకీయం.. ఇప్పటికే రెండు పడవలపై ప్రయాణం చేస్తూ పవన్ విమర్శలు మూటగట్టుకున్నారు. ఇటీవల ఆ విమర్శలను తీవ్రంగా పరిగణిస్తున్న పవన్.. ఇకపై అలాంటి విమర్శలకు తావివ్వద్దన్న నిర్ణయానికి కూడా వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అజ్ఞాతవాసితో తన సినీ ప్రస్థానానికి పవన్ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

   అదొక్కటి చెప్పు చాలు..:

  అదొక్కటి చెప్పు చాలు..:

  పవన్ ఇక తెరపై కనిపించడంటే ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఆయన్ను చూడాలనుకుంటున్న అభిమానులు ఉన్నారు. మొత్తం మీద రెండింటిలో ఏదో ఒక దాన్ని పణంగా పెడితే తప్పితే.. పూర్తి స్థాయిలో ఒకదానిపై ఫోకస్ చేయడం కష్టం. కాబట్టి.. పవన్ ఇప్పటికైనా అభిమానులకు క్లారిటీ ఇస్తే.. వాళ్లు కాస్త టెన్షన్ నుంచి బయటపడుతారని అంటున్నారు.

  English summary
  Pawan Kalyan fans are eagerly waiting to know that Agnyaathavaasi is his last movie or not?. Till now Pawan was not announced officially about this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X