»   » ఆమెను చూస్తే మెగా అభిమానుల తిక్క దిగిపోతుంది! (ఫోటోస్)

ఆమెను చూస్తే మెగా అభిమానుల తిక్క దిగిపోతుంది! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనేసి, మ‌న్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'తిక్క'. సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్ రెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో సాంగ్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ ఐటం గర్ల్ సాయి ధరమ్ తేజ్, ఫరాహ్ కరిమి కాంబినేషన్లో ఇక్కడ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ఫరాహ్ కరిమి అందం ఈ సినిమాకు హైలెట్ అవుతుందని, తెరపై ఫరాహ్ కరిమి అందం చూసిన తర్వాత మెగా అభిమానుల తిక్క దిగిపోవడం ఖాయం అంటూ కొందరు చమత్కరిస్తున్నారు.


సినిమా గురించి నిర్మాత సి.రోహిణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌స్తుతం భారీ సెట్ వేసి అందులో సాయిధర‌మ్ తేజ్‌, ప‌ర‌హ్ మ‌ధ్య స్పెష‌ల్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నాం. ప్రేమ్‌ర‌క్షిత్ మాస్ట‌ర్ ఈ సాంగ్‌కు డ్యాన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. తేజ డ్యాన్సులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అద‌ర‌గొడుతున్నాడు. ఈ సాంగ్‌లోతాగుబోతు ర‌మేష్‌, స‌త్య కూడా పాల్గొంటున్నారు. ఈ సాంగ్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అవుతుంది అన్నారు.


స్లైడ్ షోలో తిక్క సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు, పరాహ్ కరిమి ఫోటోస్....


తిక్క

తిక్క

ద‌ర్శ‌కుడు సునీల్‌రెడ్డి మాట్లాడుతూ `ప్ర‌స్తుతం సాంగ్ కాకుండా మ‌రో రెండు సాంగ్స్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయని తెలిపారు.


హైదరాబాద్, లడఖ్

హైదరాబాద్, లడఖ్

రెండు అందులో ఒక సాంగ్ హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తే మ‌రో సాంగ్‌ను ల‌డ‌ఖ్‌లో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు దర్శకుడు.


ఆగస్టు రిలీజ్

ఆగస్టు రిలీజ్

అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను ఆగ‌స్టులో విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.


సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ

సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ

నిర్మాత రోహిణ్‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తుంటే ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డిగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెరెకెక్కిస్తున్నారని తెలిపారు.


ప‌ర‌హ్ మాట్లాడుతూ

ప‌ర‌హ్ మాట్లాడుతూ

ముందు ద‌ర్శ‌కుడు వ‌చ్చి స్పెష‌ల్ సాంగ్ చేయాల‌న‌గానే బాగా ఆలోచించాను. అయితే పాట ట్యూన్ క్యాచీ అనిపించ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను అన్నారు.


న‌టీన‌టులు..

న‌టీన‌టులు..

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రా, ముమైత్ ఖాన్, ఫరా కరిమీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ఆలి, సప్త‌గిరి, తాగుబోతు ర‌మేష్‌, వెన్నెల కిషోర్‌, అజ‌య్‌, ర‌ఘుబాబు, ప్ర‌భాస్ శ్రీను, స‌త్య‌, ఆనంద్‌, వి.జే.భాని, కామ్నా సింగ్‌ న‌టించ‌ారు.


టెక్నీషియ‌న్స్‌..

టెక్నీషియ‌న్స్‌..

సంగీతం- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌
ఎడిట‌ర్‌- కార్తీక్ శ్రీనివాస్‌
ఆర్ట్‌- కిర‌ణ్ కుమార్‌
క‌థ‌- షేక్ దావూద్‌
మాట‌లు- ల‌క్ష్మీ భూపాల్ అండ్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌
డాన్స్‌- ప్రేమ్ ర‌క్షిత్‌
యాక్ష‌న్‌- విలియ‌మ్ ఓ.ఎన్‌.జి, రామ్‌-లక్ష్మ‌ణ్‌, ర‌వివ‌ర్మ‌, జ‌ష్వా
కెమెరా- కె.వి.గుహ‌న్‌
స‌హ‌నిర్మాత‌-కిర‌ణ్ రంగినేని
నిర్మాత‌- డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి
ద‌ర్శ‌కత్వం- సునీల్ రెడ్డి


English summary
Check out photos of Thikka Movie item girl Farah karimi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu