Don't Miss!
- Lifestyle ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇలియానాను చూస్తుంటే ముచ్చటేస్తోంది
నటన పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఎంత కష్టమైన స్టెప్పులను చూపించినా వాటిని అవలీలగా చేసేస్తోంది. ఆమెకు డ్యాన్స్ కంపోజ్ చేయడం చాలా సులభం.డ్యాన్స్ కంపోజింగ్‌లో ఎంత బాగా సహకరిస్తుందో..నిజంగా ఇలియనాను మెచ్చుకోవాలి అంటోంది ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్.ఆ మధ్య గోవా బ్యూటీ ఇలియానా ఆ మధ్య షూటింగ్లో గాయపడి ఆసుపత్రిపాలైంది. దీంతో కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుని మళ్ళీ 'నన్బన్' షూటింగ్లో పాల్గొంది. ఫరాఖాన్ ఈ చిత్రంలోని పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేస్తోంది. ఓ పాటకు నృత్యం చేస్తున్నప్పుడే ఇలియానా కాలుకి ఫ్రాక్చర్ అయింది. దీనిపై ఫరాఖాన్ ఇలా స్పందించింది. అలాగే ఇలియానా కాలుకి ఫ్రాక్చర్ అయినా ఏమాత్రం లెక్కచేయలేదు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకొని వెంటనే షూటింగ్లో జాయిన్ అయిపోయింది అంది. ప్రస్తుతం ఇలియానాకు తెలుగులో ఆఫర్స్ ఏమి లేవు. నేనూ నా రాక్షసి,శక్తి ప్లాపులతో ఆమె వైపు చూసే వారే కరువయ్యారు. దాంతో ఇప్పుడు ఇలియానా దృష్టంతా ఈ చిత్రం మీదే. ఎందుకంటే రోబో శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతోనైనా తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని ఈ గోవా భామ భావిస్తోంది.
అందుకనే ఈ చిత్రంలోని పాటలకు బాగా కష్టపడి డ్యాన్స్ చేస్తోందట. ఇలియానా బాలీవుడ్లో రణ్‌బీర్‌కపూర్ సరసన 'బర్ఫీ' చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగులో అల్లు అర్జున్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేస్తున్న త్రీ ఇడియట్స్ చిత్రం సైతం చేస్తోంది. విజయ్, జీవా, శ్రీకాంత్ కాంబినేషన్లో శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. అప్పుడు ఇలియానా మాట్లాడుతూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. అలాగే ముగ్గురు హీరోలూ చాలా ఫ్రెండ్లీగా మెలిగారు. హిందీ 3 ఇడియట్స్ చూశాను. నా నటనలో కరీనా ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడ్డాను. కరీనా చేసినట్లుగానే నేను కూడా యాక్ట్ చేస్తే ఇక సినిమా చేయడమెందుకు, 3 ఇడియట్స్ చూస్తే కరీనా శైలి కనిపిస్తుంది.నన్బన్ నా టైప్‌లో ఉంటుంది అని చెప్పింది.