ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరక్టర్ ఫర్హా ఖాన్ ప్రస్తుతం Jaane Jahan Se Aayi అనే హిందీ సినిమాలో ఓ నిర్మాతగా ఏక్టింగ్ చేస్తోంది. మిలీప్ జవారి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రితీష్ దేశముఖ్ ఆమెకు అసెస్టెంట్ గా చేస్తున్నాడు. అందులో ఎప్పుడు ప్రతి సన్నివేసంలో ఆమె తన అసెస్టెంట్ ని విసుక్కుంటూంటుంది. అందులో బాగంగా ఆమె అతని తెచ్చిన టీ త్రాగి బాగాలేదని ముఖంపై ఉమ్ము వేస్తుంది. అతను సహనంగా తుడుచుకుంటాడు. అయితే ఆ సన్నివేశం ఓకే అవటానికి ఆమె మూడు టేక్స్ తీసుకుంది. దాంతో అతను మూడు సార్లు ఉమ్మివేయించుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సన్నివేశం బాగా రావటమే తనకు ముఖ్యమని మరోసారికి కూడా రెడి అయిపోయాడు రితీష్. అది చూసిన యూనిట్ సభ్యులు అతన్ని జాలిగా చూసారు. డైరక్టర్, ఫర్హా ఖాన్ మాత్రం అతన్ని తెగ మెచ్చుకున్నారు. అదీ సంగతి.
Story first published: Thursday, May 14, 2009, 17:41 [IST]