»   » ప్రముఖ నటుడి మాజీ భార్య మరో సెలబ్రీటితో డేటింగ్.. నా కొత్త ప్రియుడు చాలా..

ప్రముఖ నటుడి మాజీ భార్య మరో సెలబ్రీటితో డేటింగ్.. నా కొత్త ప్రియుడు చాలా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు ఫర్హాన్ అఖ్తర్‌ దంపతులు విడిపోవడం అప్పట్లో బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకొన్నారు కూడా. అయితే తాజా వార్త ఏమిటంటే ఫర్హాన్ మాజీ భార్య అధునా భాబని ప్రస్తుతం ప్రముఖ నటుడు డినో మారియా సోదరుడు నికొలో మారియాతో డేటింగ్ చేస్తున్నదనే హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

శ్రద్ధా కపూర్‌తో ఫర్హాన్..

శ్రద్ధా కపూర్‌తో ఫర్హాన్..

కాగా, భార్యక దూరంగా ఉంటున్న ఫర్హాన్ తొలుత అదితి రావు హైదరీతో ఆ తర్వాత శ్రద్ధాకపూర్‌తో అఫైర్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అధునా గురించి అలాంటి వార్తలు రాలేదు. కానీ తాజాగా ఆమె పుట్టిన రోజున ఓ కవిత రాసింది. ఆ కవిత ద్వారా ఆమె కూడా అఫైర్‌లో ఉన్నట్టు స్పష్టమైంది

నా కొత్త ప్రియుడు..

నా కొత్త ప్రియుడు..

తన అఫైర్‌కు బలం చేకూర్చేలా అధునా ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సారాంశమేమిటంటే ‘నేను ప్రేమించే నా పిల్లల తండ్రి మంచి మానవత్వం కలిగిన వ్యక్తి. నా కొత్త ప్రియుడు మాత్రం చాలా సహనం ఉన్న వ్యక్తి' అని పేర్కొన్నారు.

రూమర్‌కు మరింత బలం..

రూమర్‌కు మరింత బలం..

నికోలో మారియాతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్‌కు ఈ పోస్ట్ మరింత బలం చేకూర్చింది. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల తిరగడం వల్ల వారి మధ్య ఏదో జరుగుతున్నదని ఊహించారు. పలుసార్లు వారు మీడియా కంట పడ్డారు. తాజా పోస్టింగ్‌తో అధునా, నికోలస్ మధ్య అఫైర్ జోరుగా జరుగుతున్నదని వార్త బలపడింది.

ఫర్హాన్‌తో శ్రద్ధా అఫైర్

ఫర్హాన్‌తో శ్రద్ధా అఫైర్

ఇదిలా ఉండగా ఫర్హాన్ అఖ్తర్‌తో శ్రద్ధాకపూర్ ప్రేమలో పడినట్టు బాలీవుడ్ సర్కిల్స్‌లో విశేషంగా ప్రచారమవుతున్నది. అంతేకాకుండా వారిద్దరూ సహజీవనం చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆ మధ్యలో ఫర్హాన్ అఖ్తర్ నివాసం నుంచి శ్రద్ధాకపూర్‌ను ఆమె తండ్రి, హిందీ చిత్రాల్లో ప్రముఖ విలన్ శక్తికపూర్ తీసుకెళ్లినట్టు కథనాలు ప్రచురితమయ్యాయి.

భట్ ఫ్యామిలీ విందులో గొడవ

భట్ ఫ్యామిలీ విందులో గొడవ

భట్ ఫ్యామిలీ తాజాగా నిర్వహించిన విందుకు ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్యరాయ్ కపూర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో ఆదిత్యతో శద్ధా అతిచనువుగా వ్యవహరించడం ఫర్హాన్ అఖ్తర్‌కు ఆగ్రహం తెప్పించిందట. వెంటనే శ్రద్ధాకపూర్‌కు దూరంగా ఉండాలని సీరియస్‌గా ఆదిత్యను ఫర్హాన్ మందలించాడట.

ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం

ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం

ఈ క్రమంలో ఫర్హాన్ హెచ్చరికలను అదిత్య సీరియస్‌గా తీసుకోవడంతో వారిద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొన్నదని సమాచారం. పరిస్థితి చేజారి పోతుండటంతో శ్రద్ధా రంగంలోకి దిగి ఫర్హాన్, ఆదిత్యకు నచ్చజెప్పిందట. దాంతో వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం తగ్గుముఖం పట్టినట్టు సమాచారం.

English summary
Adhuna Bhabani confessed to having a lover, post her break-up with husband Farhan Akhtar. Farhan and Adhuna decided to opt for divorce after matters went awry between the two. Adhuna on her birthday, she wrote a poem which had a line that got us thinking. "I just love that the father of my children is a good human being and that my new lover is a patient one," she wrote.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu