మళ్లీ అఫైర్‌లో శ్రద్ధాకపూర్.. ఆ హీరోకు ఫైనల్ ఛాన్స్.. ఈసారి తాడోపేడో!
Recommended Video

బాలీవుడ్ నటులు శ్రద్ధాకపూర్, ఫర్హాన్ అఖ్తర్ మధ్య అఫైర్ సాగుతున్నదనేది అప్పట్లో జోరుగా ప్రచారమైంది. తండ్రి శక్తికపూర్ జోక్యంతో వారి అఫైర్‌కు బ్రేక్ పడినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఈ మధ్య వారిద్దరూ రాసుకొని పూసుకొని తిరుగుతున్నట్టు మళ్లీ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఫర్హాన్ అఖ్తర్‌కు శ్రద్ధా చివరి అవకాశం ఇచ్చినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఫర్హాన్‌తో శ్రద్ధాకపూర్ అఫైర్
భాగ్ మిల్కా భాగ్ లాంటి చిత్రంతో విలక్షణ నటుడిగా రుజువు చేసుకొన్న ఫర్హాన్ అఖ్తర్ తన భార్య అధునా భాబనికి విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత శ్రద్దా కపూర్‌తో అఫైర్ కొనసాగించాడు. అయితే వారిద్దరి అఫైర్ మధ్య బ్రేక్ పడినట్టు వార్తలు వచ్చాయి.

ఫర్హాన్ అఖ్తర్‌తో అఫైర్ లేదు..
ఫర్హాన్ అఖ్తర్‌తో అఫైర్ వార్తలను శ్రద్ధా కపూర్ తోసిపుచ్చింది. మా మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని స్పష్టం చేసింది. కానీ ఫర్హాన్, శ్రద్ధాకపూర్ చాటుమాటుగా రాత్రి వేళలో కలుసుకోవడం మీడియా కంటపడింది. దాంతో వారి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ కాదు.. అఫైర్ అనే నిర్ధారణకు వచ్చారు.

విలన్‌గా మారిన శక్తికపూర్
శ్రద్ధాకపూర్, ఫర్హాన్ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఫర్హాన్‌తో శ్రద్ధా అఫైర్ కొనసాగించడం ఇష్టంలేని తండ్రి శక్తికపూర్ వారిని విడదీశాడనే ముంబై పత్రికల కథనం వెలువడింది.

ఆదిత్యరాయ్‌తోనూ క్లోజ్‌గా
ఆషికీ2, ఓకే జాను చిత్రంలో కలిసి నటించిన ఆదిత్య రాయ్ కపూర్‌తో సన్నిహితంగా ఉంటుంది అనేది శ్రద్ధాకపూర్‌పై మరో ఆరోపణ. శ్రద్దా కోసం ఆదిత్యరాయ్, ఫర్హాన్ ఇద్దరు గొడవపడినట్టు మీడియాలో వార్త వచ్చింది. ఇలా ఎవరితో అఫైర్ ఉందో తెలియక మీడియా కూడా తికమక పడింది.

మళ్లీ ఫర్హాన్ అఖ్తర్‌తో అఫైర్
అయితే తాజాగా శ్రద్ధాకపూర్ మళ్లీ ఫర్హాన్‌తో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్టు సమాచారం. వీరిద్దరు కలిసి జోరుగా షికార్లు చేస్తున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే తన ప్రేమను నిరూపించుకోవడానికి ఫర్హాన్ అఖ్తర్‌కు శ్రద్ధాకపూర్ చివరి అవకాశం ఇచ్చిందని ముంబైకి చెందిన ఓ పత్రిక హాట్ హాట్ న్యూస్ ప్రచురించింది.

ప్రభాస్‌తో శ్రద్ధాకపూర్
ప్రస్తుతం బాహుబలి ప్రభాస్‌తో సాహో చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. శ్రద్ధా కపూర్ నటించిన హసీనా పార్కర్ చిత్రం ఇటీవల రిలీజై ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది.


Click it and Unblock the Notifications











