»   » మరో సినీ జంట విడాకులు తీసుకున్నారు.... అసలేమైంది?

మరో సినీ జంట విడాకులు తీసుకున్నారు.... అసలేమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు పర్హార్ అక్తర్, ఆయన భార్య అధునా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో 15 ఏళ్ల వీరి వివాహ బంధానికి తెరపడబోతోంది. విడిపోవాలనే అంశంపై ఇద్దరం ఒక నిర్ణయాని వచ్చామని, సామరస్య పూర్వకంగా విడిపోతున్నామని ప్రకటించారు.

తాము విడిపోయినప్పటికీ...పిల్లల పెంపకం విషయంలో ఇద్దరం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, మేము విడిగా ఉంటున్నా అత్యంత ప్రాధాన్యత వారికే ఉంటుందని తెలిపారు. హుందాగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Farhan Akhtar split with his wife Adhuna

గత కొంత కాలం నుండి ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో విబేదాలు వచ్చాయని, క్రమక్రమంగా ఆ విబేధాలు విడాకులకు దారి తీసాయని అంటున్నారు. అయితే విడిపోవడం వల్ల పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు సాగుతున్నట్లు వారి ప్రకటనలో స్పష్టమవుతోంది.

పర్హాన్ అక్తర్ తనకంటే దాదాపు ఏడేళ్లు ఎక్కువ వయసున్న అధునా భబానిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దిల్ చాహతాహై సినిమాతో పర్హార్ నటుడిగా పరిచయం అయ్యాడు. అదే సినిమాకు హెయిర్ స్టైలిస్ట్ గా పని చేసింది అధునా భబాని. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం పర్హాన్ వయసు 42, అధునా వయసు 49.

English summary
Bollywood has seen umpteen numbers of divorces and break-ups over the decades. But there are only few that take one completely by surprise. This news is surely one such. Director-actor-singer Farhan Akhtar has split with his wife Adhuna after being married to her for 15 years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu