రామ్ చరణ్ తేజ్ హిందీ చిత్రం పూర్తి డిటేల్స్
రామ్ చరణ్ తేజ్ హీరోగా 'రాక్ ఆన్' ఫేం ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వివరాలు మరిన్ని బయిటకు వచ్చాయి. ఈ చిత్రం కథ ఇద్దరు స్నేహితుల మధ్య జరుగుతూంటుంది. చిత్రం టైటిల్ హఫీజ్. ఎడ్వెచర్, ఫన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం స్క్రిప్టు రూపొందించారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ ఏప్రియల్ లో ప్రారంబించి డిసెంబర్ లో రిలీజ్ చేస్తారు. కథ ఎక్కువ భాగం ముంబయిలో జరుగుతుంది. హీరోయిన్ తండ్రి పాత్రకు చిరంజీవిని అడుగుతున్నారు. కానీ ఆయన ఇంకా ఓకే చేయలేదు.
ఇక కథ మెయిన్ ప్లాట్ పేద కుర్రాడు..డబ్బు,పొగరు ఉన్న జరిగే లవ్, ఏక్షన్ ఎపిసోడ్స్ తో ఉంటుంది. రెగ్యులర్ స్టోరీ లైన్ కి వెరైటీ ట్రీట్ మెంట్ ఇవ్వనున్నారు. ఈ చిత్రాన్ని రితేష్ సిద్వాని తమ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. అలాగే రామ్ చరణ్ కి స్నేహితుడుగా చేసే హీరో అభయ్ డియోల్ అయ్యే అవకాశం ఉంది.ఇక హీరోయిన్ గా దీపికా పదుకొనే ని సంప్రదించారు. ఆమె డేట్స్ ఫైనల్ కాలేదు. ఆమె డేట్స్ లేకపోతే కంగనారౌనత్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే ఈ చిత్రం మూడు భాషల్లో(హిందీ, తెలుగు, తమిళం) ఈ చిత్రం నిర్మాణమవుతుంది.
ఇక ఈ నూతన చిత్రం విషయం గురించి పర్హాన్ అక్తర్ "చరణ్‌తో సినిమా చేయడం నాకు సంతోషకరమైన విషయమే' అని చెప్తున్నారు. మరో ప్రక్క రామానాయుడు మనవడు రాణా తొలి చిత్రం కూడా రిలీజ్ కాకముందే అభిషేక్ బచ్చన్ తో కలిసి ఓ హిందీ సినిమా చేస్తున్నారు. అదే ప్రేరణతో రామ్ చరణ్ కూడా హిందీ ఫీల్డ్ లో ప్రవేశించటానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇక ఫర్హాన్ అక్తర్ తొలి చిత్రం 2001లో వచ్చిన 'దిల్ చాహ్ తా హై'. ఆ తర్వాత ఆయన 2004లో హృతిక్ రోషన్, ప్రీతిజింటాలతో 'లక్ష్య' రూపొందించారు. ఆ తర్వాత షారూక్ ఖాన్ తో 'డాన్' చిత్రం చేసి సంచలనం సృష్టించారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ అనే చిత్రంలో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











