twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవుడా.. నేను బతికి ఉన్నాను.. చంపకండి.. ప్రముఖ నటి ఆవేదన

    బాలీవుడ్‌లో సీనియర్ నటి ఫరీదా జలాల్ (67) ఇకలేరు అనే వార్త వైరల్‌గా మారింది. దాంతో ఆమె స్పందించి నేను ఇంకా జీవించి ఉన్నానని ఓ ప్రకటన చేసింది.

    By Rajababu
    |

    బ్రేకింగ్ న్యూస్ కోసం, లేదా రేటింగ్ కోసం సినీ తారలను బతికి ఉండగానే చంపేయడం అప్పుడప్పుడు అలవాటులో పొరపాటుగా జరుగుతుంటాయి. తాజాగా అదే కోవలో బాలీవుడ్‌లో సీనియర్ నటి ఫరీదా జలాల్ (67) ఇకలేరు అనే వార్త వైరల్‌గా మారింది. దాంతో ఆమె స్పందించి నేను ఇంకా జీవించి ఉన్నానని ఓ ప్రకటన చేసింది. దాదాపు వంద చిత్రాల్లో నటించిన నటి ఫరీదా జలాల్ పుష్పక విమానం అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు.

    సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను..

    సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను..

    తన మరణవార్తను విన్న వెంటనే ఫరీదా జలాల్ స్పందిస్తూ.. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని తెలిపారు. తన మరణవార్తపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని వెల్లడించారు. ఇలాంటి వార్తలను ఎందుకు ప్రచారం చేస్తారో తెలియదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    ఇలాంటి రూమర్లు ఎక్కడి నుంచి వస్తాయో..

    ఇలాంటి రూమర్లు ఎక్కడి నుంచి వస్తాయో..

    ‘ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. నా మరణవార్త గురించి చదువుకొని నేను నవ్వుకొన్నాను. సోషల్ మీడియాలో ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో ఇంట్లో ఫోన్ నిరంతరంగా మోగుతూనే ఉంది. నా ఆరోగ్యం గురించి అందరూ వాకబు చేయడంతో వారికి చెప్పలేక తలనొప్పి వచ్చేసింది. ఈ విషయం కొంత విసుగు, చిరాకు తెప్పించింది. ఎందుకు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారో అర్థం కాదు' అని ఫరీదా అన్నారు.

    1963లోనే బాలతారగా బాలీవుడ్‌లోకి

    1963లోనే బాలతారగా బాలీవుడ్‌లోకి

    బాలీవుడ్‌లో సీనియర్ నటి అయిన ఫరీదా జలాల్ ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్గోషియాన్ చిత్రంలో నటిస్తున్నారు. 1963లో యే రాస్తే హై ప్యార్ కే అనే చిత్రంలో బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. 90 దశకంలో రాజా హిందూస్థానీ, కుచ్ కుచ్ హోతా హై, దిల్ తో పాగల్ హై, కహో నా ప్యార్ హై, కభీ కుషీ కభీ ఘమ్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. డీడీఎల్‌జే చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకొన్నారు.

    సిల్వస్టర్ స్టాలోన్, అమితాబ్‌కే తప్పలేదు..

    సిల్వస్టర్ స్టాలోన్, అమితాబ్‌కే తప్పలేదు..

    ఇటీవల కాలంలో హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను ఈ పొరపాటులో చేర్చారు. ఆ తర్వాత వారు మేము బతికి ఉన్నాం దేవుడో అంటూ సోషల్ మీడియాలో స్పందించడంతో ఆ వివాదానికి తెరపడింది.

    English summary
    "I am hale and hearty," Farida said in a statement, following the death news rumours that went viral on social networking sites. The 67-year-old actress wonders why people spread such rumours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X