ఫర్జానా అప్పుడేనా?

'నాతో వస్తావా' అనే పల్లవితో సాగే ఈ సాంగ్ లో ఆమె ఇప్పటివరకూ కనపడనంత శృంగారంగా కనిపించనుందని సమాచారం. వాస్తవానికి కొరియాగ్రాఫర్ స్ధాయి నుండి హీరోయిన్ గా మారిన ఆమె చేసినవి కొద్ది సినిమాలే అయినా తన ఒంపుసొంపులతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసింది. అల్లరి నరేష్ తో ఎక్కువగా చేసిన ఆమె పై రూమర్స్ కూడా అదే స్ధాయిలో వచ్చాయి.ఇక ఇప్పుడు ఈ సినిమాతో ఐటం సాంగ్స్ ఆఫర్స్ కూడా కంటిన్యూగా వచ్చే అవకాశం ఉంది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రమేష్ వర్మ కథ అందించారు. ఇక ఈ సినిమా వచ్చే నెల 11 న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











