2011లో ఎక్కువ పైరసీకి గురైన చిత్రం

By Srikanya

పైరసీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే. దాంతో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకున్న చిత్రానికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తాజాగా 2011లో అత్యధికంగా పైరేట్‌ అయిన హాలీవుడ్‌ చిత్రాల చిట్టాను వెల్లడించింది టోరెంట్‌ఫ్రీక్‌ అనే వెబ్‌సైట్‌. అందులో విన్‌ డీజిల్‌ హీరోగా నటించిన యాక్షన్‌ చిత్రం 'ఫాస్ట్‌ ఫైవ్‌' ఫస్ట్ పేస్ లో నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.మూడు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు హాలీవుడ్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఆన్‌లైన్‌లో ఈ చిత్రాన్ని అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు ఎక్కువ ఆసక్తి ప్రదర్శించారు. దాదాపు 93 లక్షలసార్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

ఇక రెండో స్థానంలో 'ది హ్యాంగోవర్‌ పార్ట్‌-2' నిలిచింది. ఈ చిత్రానికి 88 లక్షల హిట్స్‌ వచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర రూ.2900 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక మూడో స్ధానం 'థోర్‌'కి దక్కింది. ఎండ్వెంచర్స్ తో కూడిన చారిత్రక కథతో రూపొందిన 'థోర్‌' పెద్దగా హిట్ కాలేదు. అయితే నెట్‌ పైరసీలో మూడో స్థానం దక్కించుకొంది. దాదాపు 83 లక్షల సార్లు ఈ సినిమా నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ అయ్యింది. 80 లక్షల డౌన్‌లోడ్‌లతో నాలుగో స్థానంలో నిలిచిన చిత్రం 'సోర్స్‌ కోడ్‌'. 'ఐయామ్‌ నంబర్‌ 4' చిత్రం పైరసీ జాబితాలో అయిదో స్థానంలో ఉంది. దాదాపు 76 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ అయ్యింది.

ఇక హాలీవుడ్ లో ఎంతో హైప్ తో విడుదలైన ఫాంటసీ థ్రిల్లర్‌ 'సక్కర్‌ పంచ్‌'పెద్ద ప్లాప్. అయితే పైరసీలో మాత్రం ఆరో స్థానం సాధించించింది. డానీ బోయెల్‌ దర్శకత్వంలో వచ్చిన '127 అవర్స్‌' సినిమా 2010లో విడుదలైనా.. దానికి ఎక్కువ నెట్‌ డౌన్‌లోడ్‌లు వచ్చింది మాత్రం 2011లోనే. ఈ సినిమా పైరసీ జాబితాలో ఏడో స్థానం సాధించింది. ఆ తరవాతి స్థానంలో ఉన్నది యానిమేషన్‌ చిత్రం 'రాంగో'. ఇది 64 లక్షలసార్లు డౌన్‌లోడ్‌ అయ్యింది. నాలుగు ఆస్కార్‌ పురస్కారాలు పొందిన 'ది కింగ్స్‌ స్పీచ్‌'కి తొమ్మిదో స్థానం దక్కింది. అవార్డులు దక్కిన తరవాతే ఎక్కువ మంది ఈ చిత్రమ్మీద ఆసక్తి కనబరచారట. 60లక్షల డౌన్‌లోడ్‌లు ఈ చిత్రానికి దక్కాయి. పదోస్థానంలో 'హ్యారీపాటర్‌ అండ్‌ ది డెత్లీ హాలోస్‌-2' నిలిచింది. మరి తెలుగులో ఏ చిత్రం ఎక్కువ డౌన్ లోడ్ అయ్యిందో..ఎవరైనా ప్రకటిస్తే బావుండును.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X