ఫాదర్స్ డే: రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, వరుణ్ తేజ్, రకుల్ సెలబ్రేషన్స్
ఫాదర్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ తదితరులు తమ జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాము ఈ స్థాయికి రావడానికి తమ వెనకుండి నడిపించింది, కష్టాల్లో సుఖాల్లో వెన్ను దన్నుగా నిలిచింది వారే అంటూ పలువురు తారలు గుర్తు చేసుకున్నారు. నాన్నే నా గైడ్, నా హీరో, నా ఇన్స్‌స్పిరేషన్... అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నాన్నను మించిన హీరో లేడు అంటూ నాని ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్
రామ్ చరణ్: నాన్నే నా గైడ్, నా హీరో, నా ఇన్స్‌స్పిరేషన్... అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు
అల్లు అర్జున్
అల్లు అర్జున్: నీ లాంటి నాన్నను కలిగి ఉండటం నా అదృష్టం. నేను ప్రతి రోజూ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకునేంత మంచి నాన్నవు నువ్వు
నాని
నాని: నాన్నను మించిన హీరో లేడు, అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్: నాన్నే నా బలం. లవ్యూ నాన్న. ప్రపంచంలోని అందరు గొప్ప తండ్రులకు హ్యాపీ ఫాదర్స్ డే
మంచు లక్ష్మి
మంచు లక్ష్మి : మీరు మా కోసం ఎన్నో పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పడూ మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా
రకుల్ ప్రీత్
.
హంసా నందిని
.
కోన వెంకట్
కళ్ళు మూసి ప్రేమించేది ప్రియురాలు..
కళ్ళు తెరుచుకొని ప్రేమించేది స్నేహితురాలు ..
కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య ..
కళ్ళు మూసేంతవరకు ప్రేమించేది అమ్మ ..
కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న !!
ఆది సాయి కుమార్
.


Click it and Unblock the Notifications











