ఆ సెంటిమెంట్ తో గోపీచంద్?
గోపీచంద్ సినిమాలు పగ, ప్రతీకారం, కొద్దిపాటి సెంటమెంట్, ఎంటర్టైన్మెంట్ లతో మిక్సయి ఉంటాయనే సంగతి తెలిసిందే. అదే కోవలో తాజాగా అతను చేస్తున్న శంఖం చిత్రంలో తండ్రి సెంటిమెంట్ ప్రధానంగా ఉండబోతోందని సమాచారం. అందుకోసమే ప్రత్యేకంగా సత్యరాజ్ ని ఆ పాత్రలోకి తీసుకున్నారు. గతంలోనూ గోపీచంద్ హిరోగా నటించిన "లక్ష్యం" చిత్రంలో మదర్ సెంటిమెంట్, ఒంటరిలో లవర్ సెంటిమెంట్ "శౌర్యం" చిత్రమలో సిస్టర్ సెంటిమెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఈ ప్రతీకారాలూ, సెంటిమెంట్లూ కాకుండా తను నటించబోయే చిత్రాల్లో వెరైటీ ఉండాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అందునిమిత్తం వై.వి.యస్.చౌదరి, శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో పనిచేయటానికి కథలు వింటున్నాడని తెలుస్తోంది. అయితే ఆ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది.
shankam gopichand sentiment satyaraj lakshyam kota srinivas rao ontari souryam గోపీచంద్ సెంటమెంట్ శంఖం సత్యరాజ్ లక్ష్యం ఒంటరి శౌర్యం


Click it and Unblock the Notifications