పోర్న్‌స్టార్‌వా? సిగ్గులేదా? ఆఫర్లు లేవా విప్పేస్తున్నావ్ .. దంగల్ హీరోయిన్‌కు చేదు అనుభవం

దంగల్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఫాతిమా సనా షేక్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది.

By Rajababu

Recommended Video

Netigens Comments On Dangal Actress పోర్న్‌స్టార్‌వా? సిగ్గులేదా?

దంగల్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఫాతిమా సనా షేక్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. చీరకట్టులో అందంగా ముస్తాబై తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా దానిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పోర్న్ స్టార్, సిగ్గులేదా లాంటి వ్యాఖ్యలతో నానా మాటలు అనడం మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో రంజాన్ నెల సందర్భంగా స్విమ్ సూట్ ధరించిన ఫాతీమాపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే.

 బాలతారగా ఇండస్ట్రీలోకి

బాలతారగా ఇండస్ట్రీలోకి

హిందీలో కమల్ హాసన్ రూపొందించిన చాచీ 420 చిత్రంతో బాలతారగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పేరు రాకపోయినా దంగల్ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సహజంగా అందంగా కనిపించే ఫాతీమాను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరాధిస్తుంటారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని కూడా ప్రపోజల్స్ పెడుతుంటారు.

ఫాతీమా పోస్ట్ చేసిన ఫొటో ఇదే..

తాజాగా ఎరుపు రంగు చీరలో అదిరిపోయే ఫోజు ఇచ్చిన ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కింద చాలా దారుణంగా కామెంట్లు కనిపించాయి. అవి ఏమిటంటే..

 సిగ్గులేదా అనే కామెంట్

సిగ్గులేదా అనే కామెంట్

నెటిజన్లలో ఓ వ్యక్తి సిగ్గులేదా అని కామెంట్ పెట్టగా, మరో వ్యక్తి నీ ఫొటో చూస్తే నీకు ఆఫర్లు లేనట్టు కనిపిస్తున్నది. అందుకే బట్టలు విప్పి రెచ్చగొడుతున్నది అని కామెంట్ పెట్టాడు.

 పోర్న్‌స్టార్‌గా మారిపో

పోర్న్‌స్టార్‌గా మారిపో

ఇంకో నెటిజన్ మరో అడుగు ముందేసి దారుణమైన కామెంట్ చేశాడు. నీవు ఒక పని చేయి.. పోర్న్‌స్టార్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తున్నది.

ముస్లిం పేరును మార్చుకో

ముస్లిం పేరును మార్చుకో

మరో వ్యక్తి అయితే ఫాతీమాను ఉద్దేశించి హద్దు మీరి కామెంట్ చేశాడు. దయచేసి ముస్లిం పేరును మార్చుకో. వేరే మతం పేరు పెట్టుకొని నీవు ఏమి చేయాలంటే అది చేయి. అది నీ ఇష్టం. మాకేం ఇబ్బంది కాదు అనేలా ఫొటో కింద కామెంట్ చేశాడు.

 వేశ్య అంటూ కామెంట్

వేశ్య అంటూ కామెంట్

మహిళను ఉద్దేశించి పబ్లిక్‌గా అలాంటి మాటలు వాడకూడదనే కనీస మర్యాదను మరిచాడు మరో నెటిజన్. తెర మీద మరో.. వేశ్య అంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించాడు.

 పేరుకైనా గౌరవం ఇవ్వు

పేరుకైనా గౌరవం ఇవ్వు

మరో వ్యక్తి నీవు ఏంటో గుర్తుపెట్టుకొని మసలు. నీ పేరుకైనా గౌరవం ఇవ్వు అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా ఫాతీమా సనా షేక్‌పై నెటిజన్లు చేసిన కామెంట్లు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

 థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌ చిత్రంలో

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌ చిత్రంలో

ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య రూపొందిస్తున్న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో ఫాతీమా నటిస్తున్నది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం 2018లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X