బాలకృష్ణ కుమార్తె కు ఇష్టమైన సినిమా
హైదరాబాద్ : బాలకృష్ణ కుమార్తె బ్రహ్మిణికి ఇష్టమైన సినిమా ఏమిటీ... అంటే సమాధానం చెప్పుకొచ్చారు. తన తండ్రి నటించిన ఆదిత్యా 365 చిత్రం తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఎప్పుడైనా ఖాళీ దొరికితే సినిమాలు చూస్తామని, ముఖ్యంగా తమ తాతగారైన ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తామని ఆమె అన్నారు. ఇక రీసెంట్ గా తన తండ్రి నటించిన సినిమాల్లో బాగా నచ్చింది లెజండ్ అని చెప్పారు. బ్రహ్మిణి వివాహం...లోకేష్ తో ఆగస్టు 26, 2007 న జరిగింది. ప్రస్తుతం ఆమె హెరిటేజ్ ఫుడ్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా సిద్ధమవుతోంది. ఇప్పటికే కథ, దర్శకుడు ఎంపిక పూర్తికాగా ఇప్పుడు హీరోయిన్ కోసం దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిష లేదా శ్రియలలో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తొలుత ఈ పాత్రలో అంజలిని అనుకున్నా తర్వాత నిర్ణయం మారింది. సత్యదేవ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా జూన్ 10న సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











