బ్లాక్ మనీ.... అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు స్టార్స్!
ముంబై: దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దవ్వడంతో..... సినిమా ఇండస్ట్రీపై కూడా భారీగానే పడింది. బ్లాక్ మనీ, దొంగనోట్లను అరికట్టేందుకు ప్రధాన నరేంద్రమోడీ తీసుకున్న ఈ నిర్ణయం.... భారీగా బ్లాక్ మనీ పోగేసుకున్న కొందరు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లకు మింగుడు పడటం లేదు.
అసలు సినిమా ఇండస్ట్రీలో వ్యవహారాలన్నీ సగం బ్లాక్, సగం వైట్ మనీతో సాగుతాయనేది అందరికీ తెలిసిన రహస్యమే. హీరోలు, హీరోయిన్లు... తాము తీసుకునే రెమ్యూనరేషన్, ఇన్ కంటాక్స్ లెక్కల్లో చూపించే వివరాల్లో చాలా తేడా ఉంటుంది.
సినీ ఇండస్ట్రీలో జరిగే ఈ బ్లాక్, వైట్ వ్యవహారాలను బయట పెట్టేందుకు హిందీ ఛానల్ నెట్వర్క్ 18 వారు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.

సిద్ధంగా లేరు
నోట్ల రద్దు వ్యవహారంతో ఇప్పటికే తమ వద్ద ఉన్న బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకు ఇండియన్ స్టార్స్ చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారెవరూ బ్లాక్ మనీ స్వీకరించే పరస్థితిలో లేరు. దీంతో నెట్వర్క్ 18 వారు పాకిస్థాన్ నటులపై ఫోకస్ పెట్టింది.

ఫావద్ ఖాన్
ఇటీవల విడుదలైన ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాలో నటించిన పాకిస్థాన్ నటుడు ఫావద్ ఖాన్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. అతడు పాకిస్తానీ కావడంతో సినిమా సినిమా ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఇతడితో పాటు మరో పాక్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ నక్విలపై నెట్వర్క్ 18 స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

ఎవరు ఎంత డిమాండ్ చేసారు?
ఈ నటుల మేనేజర్లను సంప్రదించి.... 2 గంటల పాటు సాగే ఓ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారట. ఇందుకోసం ఫవాద్ ఖాన్ మేనేజర్ రూ. 50 లక్షలు, ఇమ్రాన్ అబ్బాస్ నఖ్వి మేనేజర్ రూ. 35 లక్షలు డిమాండ్ చేశారు.

బ్లాక్, వైట్
ఫాదన్ ఖాన్ మేనేజర్ 25 శాతం బ్లాక్‌లో ఇవ్వాలని, మిగిలిన సొమ్మును విదేశాలలో ఉన్న ఖాతాలో వేయాలని కోరాడట. ఇక ఇమ్రాన్ మేనేజర్ తనకు రూ. 32లక్షలు బ్లాక్‌లో కావాలని, కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే వైట్ లో తీసుకుంటానని చెప్పారట.


Click it and Unblock the Notifications











