ఆ పని చేయదట! చాలెంజింగ్ రూట్లో సమీరారెడ్డి
పటపిటలాడే అందాలతో ఎక్స్ ఫోజింగ్ చేస్తూ ఇప్పటి వరకు గ్లామరస్ హీరోయిన్‌గా కనిపిస్తూ వస్తున్న హీరోయిన్ సమీరారెడ్డి ఇకపై ఎక్స్ ఫోజింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయమై ఇటీవల ఆమె వ్యాఖ్యానిస్తూ...''ఇప్పటి వరకు నాకు వచ్చిన సినిమా అవకాశాల్లో ఎక్కువగా ఎక్స్ ఫోజింగ్, ఆల్ట్రా గ్లామరస్ రోల్స్ మాత్రమే వచ్చాయి. నేను కూడా వాటిని ఇష్టంగానే చేసుకుంటూ వెళ్లాను. ఇలా చేయడం మంచిదే. కానీ నేను ఇకపై ఇలాంటి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇకపై నటనకు ప్రాధాన్యం ఉన్న చాలెంజింగ్ రోల్స్ పై మాత్రమే నా దృష్టి ఉంటుంది'' అంటూ హీరోయిన్ సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.
హిందీలో అవకాశాలు తగ్గి పోవడంతో ఈ మధ్య అమ్మడు ఎక్కువగా తమిళ సినిమాల్లోనే మెరుస్తోంది. ఈ సంవత్సరం వెట్టయ్ చిత్రంలో నటించింది. తాజాగా 'తేజ్' అనే హిందీ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. మత్తెక్కించే ఒంపు సొంపులు, హాట్ ఆటిట్యూడ్ గల సమీరా.... గ్లామర్ రోల్స్ లో అయితేనే సూట్ అవుతుందని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో ఆమె ఒదగడం కష్టమే భావన సినీ వర్గాల్లో ఉండది. అసలే సమీరాకు అవకాశాలు అంతంత మాత్రం. మరి ఎక్స్ ఫోజింగ్ కు దూరంగా ఉంటే ఈవిడ వైపు ఎవరైనా చూస్తారో? లేదో? అనే సందేహాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











