అక్కినేనికి ఎన్నారైల సన్మానం

By Bojja Kumar

న్యూజెర్సీ: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అమెరికా ఎన్నారైలు ఘనంగా సన్మానించారు. న్యూ జెర్సీలోని ఫోర్డ్స్‌లో గల రాయల్ ఆల్బర్ట్ పేలేస్‌లో 18న జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన తెలుగు సంస్థల తరపున ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా అంజనా సౌమ్య, హరి వేగేశ్న, బాబా సంత్యాన, వంశీప్రియ, గిరిజ కొల్లూరి, రాజీవ్ నేదూరి, లలిత రాణి, కృష్ణ రాణి తదితరులు అక్కినేని చిత్రాల్లోని గీతాలను ఆలపించారు. అనంతరం న్యూ జెర్సీ నృత్య శిక్షణ సంస్థలకు చెందిన చిన్నారులు అక్కినేని చిత్రాలలోని పాటలకు నృత్యాలు చేసి అభినందనలు అందుకున్నారు. దామూ గేదల, ఉపేంద్ర చివుకుల, కృష్ణ బోపన్న, రవీంద్రనాథ్ గొత్తికొండ, ప్రొఫెసర్ వెంకట్రావు ములుపూరి, సరోజ సగరం, యుగంధరరావు వల్లభనేని తదితరులను అక్కినేని అవార్డులతో సత్కరించారు.

డాక్టర్ అక్కినేనికి న్యూ జెర్సీ అధికార సైటేషన్‌ను అసెంబ్లీమ్యాన్ ఉపేంద్ర చివుకుల అందజేశారు. ఒక తెలుగు చిత్ర కథానాయకునికి అమెరికాలో అధికార సైటేషన్‌తో సత్కారం లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా నటసామ్రాట్అక్కినేని డాట్ కామ్‌ను ఉపేంద్ర చిలుకూరి ప్రారంభించారు. తానా, ఆటా, నాట్స్, నాటా, క్యాట్స్ తదితర స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థలన్నీ ఈ అపురూపమైన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X