Femina Miss India World 2022: అందాల పోటీల్లో మరోసారి విజేతగా కర్ణాటక బ్యూటీ.. ఆమె ఎవరంటే?

2022 VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో ఎవరు గెలుస్తారా అని నిన్నటి వరకు కొనసాగిన సస్పెన్స్ కు తెర పడింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ అందాల పోటీలలో గెలిచేందుకు చాలామంది మోడల్స్ పోటీ పడ్డారు. కొంతమంది సినీ నటీమణులు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇక ఫైనల్ గా ఈ ఎడాది కర్నాటకకు చెందిన ఒక బ్యూటీఫుల్ మోడల్ మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆమె ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

2022 VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 విజేతగా నిలిచింది. ఫ్యాషన్ వరల్డ్ లో ఇదివరకే ఎంతగానో గుర్తింపు అందుకున్న ఆమె ఇప్పుడు తను అనుకున్న కలను సాధించడంతో చిరునవ్వుతో మరింత అందంగా కనిపిస్తోంది. ఆదివారం ముంబైలోని JIO వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు ఫ్యాషన్ వరల్డ్ లోని ప్రముఖులు అలాగే సినీ తారలు పాల్గొన్నారు.

Femina Miss India World 2022 Sini Shetty background details

ఇక ఈ పోటీలో రన్నరప్ గా రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ నిలిచారు. అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన షీనాతా చౌహాన్ ఫెమినా మిస్ ఇండియా 2022లో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. వీరు కూడా మొదటి స్థానం అందుకునేందుకు గట్టిగానే పోటీని ఇచ్చినప్పటికీ ఫైనల్స్ లో సినీ శెట్టి విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో వారికి ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరుగుతోంది.

ముంబైలో జన్మించిన 21 ఏళ్ల శెట్టి సొంత ప్రాంతం మాత్రం కర్ణాటకనే. పలు బిజినెస్ లతో వారి కుటుంబం ముంబై లోనే స్థిరపదింది. ఇక తన చదువును అక్కడే కొనసాగించిన ఆమె కొన్నాళ్ళకు ప్రముఖ ఫ్యాషన్ పోటీలలో గెలిచి ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA) కోర్సును కొనసాగిస్తోంది. అలాగే భరతనాట్యం పై కూడా మక్కువ పెంచుకుంటున్న సినీ శెట్టి సినిమా రంగంలోకి కూడా రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక సినీ శెట్టి గెలవడంతో కర్ణాటకకు మరో ఘనతను తెచ్చిపెట్టింది. ఇదివరకే అక్కడి నుంచి లారా దత్తా, సారా జేన్ డయాస్, సంధ్యా చిబ్, నఫీసా జోసెఫ్, రేఖా హండే, లైమరినా డిసౌజా వంటి ఎందరో భామలు కర్ణాటక నుంచి వచ్చి మిస్ ఇండియా విజేతగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X