»   »  ముహూర్తాల ఎఫెక్ట్: మూడు రోజుల్లో ఐదు మెగా సినిమాలు!

ముహూర్తాల ఎఫెక్ట్: మూడు రోజుల్లో ఐదు మెగా సినిమాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మూడు రోజుల్లో ఐదు మెగా ఫ్యామిలీ సినిమాలు ప్రారంభం. ఆల్రెడీ మూడు సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోగా రేపు మరో రెండు సినిమాలు ప్రారంభానికి రంగం సిద్దమైంది. ఇదంతా ముహూర్తాల ఎఫెక్టే అని చెప్పక తప్పదు.

త్వరలో కృష్ణ పుష్కరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ నెల దాటితే మంచి ముహూర్తాలు లేకపోవడంతో టాలీవుడ్లో పలు సినిమాల ప్రారంభోత్సవాలు శరవేగంగా జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య సినిమా బుధవారం ప్రారంభోత్సవం జరుపుకోగా.... వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కే 'మిస్టర్' చిత్రం ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంది. దీంతో పాటు అల్లు శిరీష్ కొత్త చిత్రం కూడా ఈ రోజు ప్రారంబోత్సవం జరుపుకుంది.

FESTIVITY! Five Mega Movies In Three Days

వరుణ్ తేజ్ సినిమా ప్రారంభోత్సవానికి వెంకటేష్ గెస్ట్ గా హాజరై క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు వరుణ్ తేజ్ తల్లిదండ్రులతో పాటు సోదరి నిహారిక కూడా హాజరైంది. అల్లు శిరీష్ చిత్ర ప్రారంభోత్సవానికి బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మరో వైపు రేపు(శుక్రవారం) సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే తర్వాతి చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. దీంతో పాటు చిరంజీవి 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో ప్రారంభం కాబోతోంది.

మెగా స్టార్ చిరంజీవి సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ లెవల్ లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ హీరోలందరితో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

English summary
In just three days of time, Five mega movies are going to roll and it is something really rare to happen in the industry. Since the family now has more than half a dozen of succesful heroes, it has become a filmy feast for mega fans and especially during the occasions like this, their joy gets doubled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu