twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్: హైదరాబాద్‌లో ఈ థియేటర్లు మళ్లీ ఓపెన్ కావు!

    |

    కరోనా వైరస్ ప్రభావం ప్రపంచం మొత్తం చూపించింది. భారతదేశంలో దాదాపు పది నెలల నుంచి జన జీవనం అస్థవ్యస్తంగా తయారైంది. వ్యాపార, వాణిజ్య పాటు ప్రజల దినచర్యల్లోనూ మార్పులు తీసుకు రావాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా వినోద రంగంపై దీని ప్రభావం చాలా పడిపోయింది. లాక్‌డౌన్ కారణంగా మార్చి నెల నుంచే సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఫలితంగా థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీలపై మళ్లుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

    తెలంగాణలో థియేటర్లు పున: ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయినప్పటికీ హైదరాబాద్‌లో ఉన్న చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు రీ ఓపెన్ అయ్యే పరిస్థితుల్లో లేవు. మరీ ముఖ్యంగా ఎంతో ఫేమస్ అయిన నారాయణగూడలోని శాంతి థియేటర్, మెహదీపట్నంలోని అంబ థియేటర్, టోలీచౌకీలోకి గెలాక్సీ సినిమాస్, ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని శ్రీమయూరీ థియేటర్‌తో పాటు బహదూర్‌పురాలోని శ్రీరామ థియేటర్లు శాశ్వతంగా మూతపడిపోయాయి. ప్రస్తుతం వీటిని ఇతర పనులకు వాడుకుంటున్నారు ఆయా సినిమా హాళ్ల యజమానులు.

    Few Theatres permanently Closed in Hyderabad

    సింగిల్ థియేటర్ల పరిస్థితి ఇలా ఉంటే.. మల్టీఫ్లెక్స్‌ల్లోని పలు స్క్రీన్లు కూడా మూతపడే అవకాశాలు ఉన్నాయి. సినిమాల సందడి మొదలైనప్పటికీ.. యాభై శాతం సీటింగ్‌తో నడవాల్సి ఉండడంతో కొన్ని స్క్రీన్లను మాత్రమే నడపాలని మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని ఏళ్ల చరిత్ర కలిగిన థియేటర్లు మూత పడుతుండడంతో సినీ ప్రియులు నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే చాలా నగరాల్లో ఇలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడిపోయిన విషయం తెలిసిందే.

    English summary
    Shanti theatre and Galaxy cinema hall were in operations for decades. Many super hit movies released in Shanti and Galaxy cinema halls. But, unfortunately, the lockdown stopped the operations of cinema halls.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X