యూఎస్ఏ : టాప్ 4లో మహేష్ ‘1’...టికెట్ ధర తగ్గింపు!
న్యూయార్క్: మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం యూఎస్ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలనే సాధిస్తోంది. తాజాగా ఈచిత్రం అమెరికాలో విడుదలై తొలి రెండు వారాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా జాబితాలో టాప్ 4 స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో విడుదల చేసిన Ficus సంస్థ ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

ఇక మూడో వారంలో అమెరికా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 50 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నట్లు Ficus సంస్థ ప్రకటించింది. అదే విధంగా జనవరి 24వ తేదీని నుండి టికెట్ ధర కూడా తగ్గించినట్లు తెలిపింది. పెద్దలకు 10 డాలర్లు, పిల్లలకు 6 డాలర్లుగా టికెట్ ధర నిర్ణయించినట్లు Ficus సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
'1 నేనొక్కడినే' సినిమా వివరాల్లోకి వెళితే.....సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రం విడుదలైంది.
సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన పూర్తి టెక్నికల్ బేస్డ్ ఫిల్మ్ కావడంతో.....మాస్ మసాలా, కామెడీ ఇష్టపడే మన మెజారిటీ జనాలకు ఎక్కలేదు. అయితే సినిమా విలువలు తెలిసిన వాళ్లు మాత్రం హాలీవుడ్ లెవల్లో అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











