సాయి పల్లవి ఎమోషనల్ స్పీచ్.. భానుమతి.. సింగిల్ పీస్.. హైబ్రిడ్ పిల్లా అంటూ..

ఫిదా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. అమ్మాయిలు కాదు.. అమ్మాయి. భానుమతి. సింగిల్ పీస్. రెండు కులాలు. రెండు మతాలు. హైబ్రిడ్ పిల్లా అంటూ సినిమాలోని డైలాగ్‌ను వినిపించి ఆకట్టుకొన్నారు. ఫిదా చిత్రంలో సాయి పల్

By Rajababu

ఫిదా రిలీజ్ తర్వాత హీరోయిన్ సాయి పల్లవి గురించి ఒకటే మాట.. ఆ పిల్ల అదరగొట్టింది. ఏం డైలాగ్స్ చెప్పింది. అచ్చం తెలంగాణ పిల్లేనా అనిపించేంతగా నటించింది. డాన్యులు, ఎక్స్ర్‌ప్రెషన్స్‌తో చంపేసింది. ఫిదా పిల్ల గురించి ఇలాంటి డైలాగ్స్ సాధారణమయ్యాయి. సాయి పల్లవి చెప్పిన ప్రతీ డైలాగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ సినిమాకు బ్రహ్మండమైన టాక్ రావడంతో ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఫిదా సక్సెస్ మీట్‌లో..

ఫిదా సక్సెస్ మీట్‌లో..

ఫిదా సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. అమ్మాయిలు కాదు.. అమ్మాయి. భానుమతి. సింగిల్ పీస్. రెండు కులాలు. రెండు మతాలు. హైబ్రిడ్ పిల్లా అంటూ సినిమాలోని డైలాగ్‌ను వినిపించి ఆకట్టుకొన్నారు. ఫిదా చిత్రంలో సాయి పల్లవి చెప్పిన డైలాగ్స్‌కు థియేటర్లలో చపట్లు, ఈలల మోత మోగుతున్న సంగతి తెలిసిందే. కేవలం నటన, డ్యాన్సులకే పరిమితం కాకుండా ఈ పాత్ర కోసం సాయి పల్లవి డబ్బింగ్ చెప్పి అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

Recommended Video

Fidaa Movie May Create New Trend
పోస్టర్ చూసి కంటతడి ..

పోస్టర్ చూసి కంటతడి ..

ఫిదా రిలీజ్ డేట్ నాకు ఎమోషన్ రోజు. సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లినపుడు ఫిదా పోస్టర్ చూసి చాలా ఉద్వేగానికి గురై కంటతడి పెట్టాను. ఈ రోజు కోసం మేమంతా ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సక్సెస్ వెనుక చాలా శ్రమ, పోరాటం, నమ్మకం అన్నీ ఉన్నాయి. ఎవరికీ ఎనర్జీ తగ్గలేదు.

తెలంగాణ పిల్లగా ఒప్పుకొంటారా అని భయపడ్డా

తెలంగాణ పిల్లగా ఒప్పుకొంటారా అని భయపడ్డా

ఫిదా ఇంతటి విజయం సాధించడానికి కారణమైన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. ప్రధానంగా ఆడియెన్స్ ధన్యవాదాలు చెప్పాను. తెలుగులో నాకు తొలి సినిమా. తెలంగాణ అమ్మాయిగా నన్ను ఒప్పుకొంటారా అని భయపడ్టాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల స్పందన చూసిన అనంతరం నాకు అప్పుడు అర్థమైంది.

రివ్యూలతో గొప్ప రిలీఫ్

రివ్యూలతో గొప్ప రిలీఫ్

ఫిదా రిలీజ్ అనంతరం రివ్యూ చదివిన తర్వాత నాకు గొప్ప రిలీఫ్ కలిగింది. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ సీన్‌లో డైలాగ్ కొట్టినపుడు అందరూ చప్పట్లు కొట్టారు. అయినా నాకు నమ్మకం కలుగలేదు. థియేటర్లలో ఆడియెన్స్ చప్పట్లు కొట్టిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. అందుకు కారణమైన దర్శకుడు శేఖర్ కమ్ములకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి.

క్రెడిట్ అంతా శేఖర్ కమ్ములకే..

క్రెడిట్ అంతా శేఖర్ కమ్ములకే..

నన్ను దృష్టిలో పెట్టుకొని నా కోసం శేఖర్ గారు ఇలాంటి క్యారెక్టర్ రాయడం చూస్తే నేను చాలా లక్కీ. ముఖ్యంగా నాపై అంతగా నమ్మకం పెట్టుకోవడం నా అదృష్టం. నాకు భాష నేర్పించి. నాతో కష్టపడి డబ్బింగ్ చెప్పించారు శేఖర్ కమ్ముల. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా శేఖర్ కమ్ములకే దక్కుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X