»   » వరుణ్ తేజ్ అందరినీ ‘ఫిదా’ చేసాడుగా.... (మోషన్ పోస్టర్)

వరుణ్ తేజ్ అందరినీ ‘ఫిదా’ చేసాడుగా.... (మోషన్ పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఫిదా'. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా 'ఫిదా' మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో వరుణ్‌ కొత్తలుక్‌లో ఆకట్టుకుంటున్నాడు.

అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య చిగురించే ప్రేమ కథాంశంతో 'ఫిదా'ను తెరకెక్కిస్తున్నారు. ప్రచార చిత్రంలో పెద్దపెద్ద అంతస్థులు, భవనాల వైపు నుంచి పల్లెటూరి వాతావరణంలో ఉన్న అమ్మాయి వైపుగా అబ్బాయి వస్తున్నట్లు చూపించారు.

మళయాలం చిత్రం 'ప్రేమమ్' ద్వారా బాగా పాపులర్ అయిన సాయి పల్లవి ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Fidaa First Look Motion Poster. Starring Varun Tej, Sai Pallavi. Directed by Sekhar Kammula. Produced by Dil Raju. Music composed by Shashikanth.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu