ఆన్‌లైన్‌లో విడుదలైన ‘ఫిదా’.... ఊహించని రెస్పాన్స్!
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన చిత్రం 'ఫిదా'. 2017లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీని తాజాగా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే 5న యూట్యూబ్‌లో విడుదల చేయగా... ఇప్పటి వరకు 738,395 వ్యూస్ సొంతం చేసుకుంది.

2017 జులై 21న 'ఫిదా' ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు చేసి శ్రీవెంకటేశ్వర బేనర్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గ్లోబర్ థియేట్రికల్ రైట్స్ రూ. 18 కోట్లకు అమ్ముడవ్వగా దాదాపు రూ. 48 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ 24, 2017న 'మా' టీవీ ప్రీమియర్ ప్రదర్శించారు. బుల్లితెరపై కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా 21.30 టీఆర్పీ రేటింగ్ సాధించి మహేష్ బాబు 'శ్రీమంతుడు' టీఆర్పీ రికార్డు (21.24 )ను బద్దలు కొట్టింది.
ఫిదా మూవీ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. శక్తికాంత్ సంగీతం అందించారు. జేబీ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


Click it and Unblock the Notifications











