»   » బ్లడ్‌లో పీకే, మహేశ్ ఉంటే.. ఆ కిక్కే వేరబ్బా.. ఫిదాలో పిచ్చెక్కిస్తున్న మాటల తూటాలు..

బ్లడ్‌లో పీకే, మహేశ్ ఉంటే.. ఆ కిక్కే వేరబ్బా.. ఫిదాలో పిచ్చెక్కిస్తున్న మాటల తూటాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఫిదా చిత్రం టాలీవుడ్‌లో కాసుల పంట పండిస్తున్నది. ఫిదాలో సాయి పల్లవి చలాకీతనం, బలమైన సన్నివేశాల మధ్య మాటల తూటాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్లాస్, మాస్ అనే భేదం లేకుండా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఈ చిత్రంలో ఆకట్టుకొంటున్న పది ఫీల్ గుడ్ సన్నివేశాలు మీకోసం...

సాయి పల్లవి ఎంట్రీ..

సాయి పల్లవి ఎంట్రీ..

మొదటి సీన్‌లో కనిపించడంతోనే సాయి పల్లవి అదరగట్టేసింది. రైలు ఎక్కడానికి పరిగెత్తుతుండగా ఓ వ్యక్తి డాష్ కొట్టడంతో కోపం తెచ్చుకొన్న సాయి పల్లవి భాడకోవ్.. బోక్కలిరగకొడుతా.. నఖరాలా అంటూ చెప్పిన డైలాగ్‌తోనే సాయి పల్లవి తనంటే శాంపిల్ చూపించింది.


గుడ్లు తీసుకురాపో..

గుడ్లు తీసుకురాపో..

పెళ్లి చూపులకు వచ్చిన వరుణ్, రాజా ఇంట్లో ఉండటం, మరోవైపు వంట పనిలో పడిన భానుమతి (సాయి పల్లవి) అత్త .. బజారుకు వెళ్లి ‘గుడ్లు.. సెనగపిండి తీసుకురాపో.. ' ఉరుకు ఉరుకు అంటూ చెప్పే సీన్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని గురిచేస్తున్నది.


Fidaa Movie Getting Very Good Response in Tollywood :Watch
సినిమాలు చూస్తే ఆ కిక్కు వేరే..

సినిమాలు చూస్తే ఆ కిక్కు వేరే..

తన అక్క పెళ్లి చూపులకు వచ్చిన వరుణ్‌ను అతని అన్నయ్య రాజ గురించి తెలుసుకొనే క్రమంలో.. సినిమాలు చూసే అలవాటు ఉందా? అని అడుగుతుంది. అందుకు సమాధానంగా ‘లెక్క ఉంది.. తిక్క ఉంది' అనే డైలాగ్ ఉండే సినిమా చూశాం వరుణ్ చెబుతాడు. మీరు ఎక్కడో ఉన్నారు.. అప్ డేట్ కండి. సినిమాలు చూస్తే ఆ మజానే వేరుంటుంది. బ్లడ్‌లో పీకే (పవన్ కల్యాణ్), మహేశ్ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.


మల్లన గుడికి వెళ్దాం..

మల్లన గుడికి వెళ్దాం..

బాన్సువాడలో ఫేమస్ మల్లన గుడికి వెళ్దాం. ‘ఉదయం 3.30 గంటలకే లేచి చన్నీళ్లతో స్నానం చేయి. అక్కడికి వెళ్లడానికి పంచ కట్టుకోవాలి' అని చెప్పి ఉదయాన్నే వరుణ్ లేపి సాయి పల్లవి ఆటపట్టించడం.. వర్షంలో ఉసిరికాయ తొక్కు తెప్పించి దానిని రుచి చూడకుండా వెళ్లినందుకు వరుణ్‌పై సాయి పల్లవి పగ తీర్చుకోవడం సన్నివేశాలను దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రతిభకు అద్దం పట్టాయి.


అమ్మాయిలు కాదు.. అమ్మాయి

అమ్మాయిలు కాదు.. అమ్మాయి

తనను ఆటపట్టించిన సాయి పల్లవిని ఉద్దేశించి అమెరికాలోనే కాదు ఇక్కడ కూడా అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అని వరుణ్ అంటాడు. అందుకు జవాబుగా ‘అమ్మాయిలు కాదు.. అమ్మాయి. భానుమతి. సింగిల్ పీస్. రెండు కులాలు, రెండు మతాలు అని సాయి పల్లవి చెప్పించడం వెనుక కులమతాలను పట్టించుకోవద్దు అనే సందేశాన్ని దర్శకుడు ఇవ్వడం గమనార్హం.


గట్టిగా అనుకో.. జరిగిపోతుంది

గట్టిగా అనుకో.. జరిగిపోతుంది

ఏదైనా జరిగితే బాగుండు సాధారణంగా అనుకొంటాం. ఈ చిత్రంలో వరుణ్ కొన్ని సన్నివేశాల్లో అలా అంటాడు. అందుకు బదులుగా ‘గట్టిగా అనుకో.. జరిగిపోతుంది' అని భానుమతి అంటుంది. ఇదే డైలాగ్ చాలా సందర్బాల్లో సాయి పల్లవి వాడుతుంది. సినిమా చూసిన తర్వాత ప్రస్తుతం ఈ డైలాగ్ జనం అనుకోవడం కనిపిస్తున్నది.


ట్రయిన్‌లో శోభనం..

ట్రయిన్‌లో శోభనం..

అక్క పెళ్లి తర్వాత ట్రయిన్‌లో శోభనం ఏర్పాట్లు చేయడం.. అది తెలిసి సాయి పల్లవి అత్త.. శోభనం ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు.. దానికి ఓ పద్దతి ఉంటుంది అని చెప్పే సీన్ ప్రేక్షకుల నవ్వుల్లో ముంచెత్తుతున్నది.


వాట్సప్‌లో చెప్పు..

వాట్సప్‌లో చెప్పు..

వరుణ్‌పై పీకల్లోతు ప్రేమలో మునిగిపోతుంది. ఒక కారణంగా వరుణ్ తప్పుగా అర్థం చేసుకొంటుంది. అతనికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో సాయి పల్లవికి వరుణ్ ప్రేమను వ్యక్త పరుస్తాడు. అందుకు జవాబుగా వాట్సప్‌లో చెప్పు ఫొటోను పంపిస్తుంది. ఆ తర్వాత తన వదిన, ఫ్రెండ్ సత్యం రాజేశ్‌కు వరుణ్ ఆ ఫొటో చూపించే సీన్లు హైలెట్‌గా నిలిచాయి.


నీవు కష్టపడుతున్నావని తెలిస్తే బతుకలేను

నీవు కష్టపడుతున్నావని తెలిస్తే బతుకలేను

సాయి పల్లవి ప్రేమను గెలుచుకోవడానికి అమెరికా నుంచి వరుణ్ బాన్సువాడ వస్తాడు. తన ప్రేమను మరోసారి సాయి పల్లవికి చెప్తాడు. నీకు ఇష్టమైతే మరొకరిని చేసుకో. కానీ నాపై కోపంతో ఇష్టం లేని వారిని చేసుకోకు. నీవు కష్టపడుతున్నావంటే నేను తట్టుకోలేను. నీవు సంతోషంగా లేవంటే నేను బతుకలేను అని వరుణ్‌తో చెప్పిన సీను సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లింది.


పెళ్లైన తర్వాత

పెళ్లైన తర్వాత

ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి ఎందుకు వెళ్లాలి అనేది ఫిదాలో ప్రధానమైన పాయింట్.. పెళ్లైన తర్వాత తన అక్కను ఇదే పాయింట్‌పై నిలదీస్తుంది. అందుకు రెక్కల గుర్రం మీద రాజకుమారుడు వస్తాడు. ఆ తర్వాత తీసుకెళ్తాడు అని చెప్తారు అనే కథను వినిపిస్తుంది. అందుకు పుట్టింటిలో ఉంటానని చెప్పమంటే కథలు చెప్తావని సాయి పల్లవి కోపగించుకొంటుంది. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉండాలన్నది సాయి పల్లవి పాత్ర అభిమతం.


అమెరికాలో ఉండే వరుణ్

అమెరికాలో ఉండే వరుణ్

పెళ్లి చేసుకొంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుందనేది ప్రేమను సాయిపల్లవి నిరాకరించడానికి ఓ కారణం. ఈ విషయం తెలిసి ఇంత చిన్న మాట చెప్పడానికి ఇంత చేశావా? ప్రపంచం ప్రపంచం అంటాం.. నీవు ఎక్కడ ఉంటే నాకు అక్కడే ప్రపంచం అని వరుణ్ పాత్ర ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన అద్భుతంగా ఉంది. క్లైమాక్స్‌ను అరిపించింది.


English summary
Director Sekhar Kammula's Telugu movie Fidaa is a romance drama starring Varun Tej and Sai Pallavi. Dil Raju has bankrolled Fidaa under his banner Sri Venkateswara Creations and he has made sure that the film has brilliant production values. Shakthi Kanth's music, Vijay C Kumar's picturisation, beautiful locales, fights and dialogues are the attractions on the technical front. Dialogues, few scenes are very thrilling in the movie and attracting the audience.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu