»   » కొందరు అలా, కొందరు ఇలా.... ‘ఫిదా’ మూవీపై ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ!

కొందరు అలా, కొందరు ఇలా.... ‘ఫిదా’ మూవీపై ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టెనర్ 'ఫిదా'. ఈ సూపర్ కాంబినేషన్‌కు తోడు దిల్ రాజు బేనర్ నుండి వస్తున్న సినిమా కావడం, ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో ముందు నుండీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

2 గంటల 14 నిమిషాల నిడివిగల ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. యూఎస్ఏలో మనకంటే ముందే ప్రిమియర్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల స్పెషల్ షోలు కూడా వేశారు. సినిమా చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలపై మీరూ ఓ లుక్కేయండి.


కథ మామూలే కానీ, ఎమోషన్స్ సూపర్

కథ మామూలే కానీ, ఎమోషన్స్ సూపర్

ఫిదా మూవీ స్టోరీ మామూలుగానే ఉన్నా.... సినిమాలో క్యారీ అయిన ఎమోషన్స్ బావున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎన్ఆర్ఐ యువకుడిగా కనిపిస్తున్నాడు. సోదరుడి వివాహం కోసం ఇండియా వచ్చిన అతడు తెలంగాణ అమ్మాయి భానుమతి(సాయి పల్లవి)పై మనసు పారేసుకుంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా తెరకెక్కించాడట.


Varun Tej Workouts For Fidaa Movie : Video Out
వరుణ్ తేజ్ అదరగొట్టాడట

వరుణ్ తేజ్ అదరగొట్టాడట

ఎన్నారై యువకుడి పాత్రలో, సాఫ్ట్ నేచర్‌ క్యారెక్టర్లో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ బావుందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ అమ్మాయి పాత్రలో సాయి పల్లవికి బాగా నటించే అవకాశం లభించిందని, ఆమె తన పాత్రలో నటించడం కాకుండా జీవించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఫిదా

ఫిదా

‘ఫిదా' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో దిల్ రాజు నిర్మించారు. ఆయన ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బ్రిలియంట్‌గా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. శక్తికాంత్ మ్యూజిక్, విజయ్ సి కుమార్ పిక్చరైజేషన్, బ్యూటిఫుల్ లొకేషన్స్, డైలాగులు ప్రేక్షకలను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటున్నారు.


సినిమాపై ఆడియన్స్ అభిప్రాయం

సినిమాపై ఆడియన్స్ అభిప్రాయం

కథ రొటీన్ గా ఉన్నా... వరుణ్ తేజ్, సాయి పల్లవి మధ్య ఉండే సీన్లు ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. ఫస్టాఫ్ బావుంది. సాయి పల్లవి ఎంతగానో ఆకట్టుకుందని ఓ అభిమాని తెలిపారు.


సూపర్ హిట్ మూవీ

సూపర్ హిట్ మూవీ

సినిమా చూసిన చాలా మంది నుండి ఫిదా మూవీ సూపర్ హిట్ అవుతుందనే.... అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



ఇతగాడికి నచ్చలేదట

ఇతగాడికి నచ్చలేదట

సెకండాఫ్ చాలా స్లోగా, బోరింగా ఉందని, మాట్లాడుకోవడానికి రెండు సీన్లు కూడా లేవు, నాకు ఈ సినిమా నచ్చలేదంటూ ఓ ప్రేక్షకలు ట్వీట్ చేశారు.



ఫస్టాఫ్ బావుంది

ఫస్టాఫ్ బావుంది

సినిమా చూసిన చాలా మంది ఫస్టాఫ్ బావుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి

సినిమా చూసిన అనంతరం వంశీ పైడిపల్లి దిల్ రాజుకు కంగ్రాట్స్ చెప్పారు. సినిమా చాలా బావుందని ప్రశంసించారు.


గుడ్ ఫస్టాఫ్, యావరేజ్ సెకండాఫ్

గుడ్ ఫస్టాఫ్, యావరేజ్ సెకండాఫ్

సినిమా చూసిన చాలా మంది ఫస్టాఫ్ బావుందని, సెకండాఫ్ యావరేజ్ గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


సినిమా సూపర్ హిట్ అవుతుంది

సినిమా సూపర్ హిట్ అవుతుంది

శేఖర్ కమ్ముల నుండి చాలా కాలం తర్వాత మంచి సినిమా వచ్చిందని, సూపర్ హిట్ అవుతుందని ఓ అభిమాని ట్వీట్ చేశారు.



పక్కా హిట్ మూవీ

పక్కా హిట్ మూవీ

ఫిదా చిత్రం శేఖర్ కమ్ములకు పక్కా హిట్ మూవీ... వరుణ్ తేజ్, సాయి పల్లవి, మ్యూజిక్ హైలెట్ అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.




English summary
Director Sekhar Kammula's Telugu movie Fidaa is a romance drama starring Varun Tej and Sai Pallavi. Here is the Fidaa movie twitter review by audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu