'బ్రదర్స్' తో పవన్ కళ్యాణ్ ఫైట్ ?
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో చిత్రం రాంబాబు చిత్రం అక్టోబర్ 11 న విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ రోజుకు ఒక రోజు ముందు సూర్య నటించిన బ్రదర్శ్ చిత్రం విడులకు ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ తెలుగుకి అందిస్తున్న ఈ చిత్రం సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. సూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడా మంచి ఓపినింగ్స్ ఉంటాయంటున్నారు. దాంతో పవన్ సినిమాకు కలెక్షన్స్ పరంగా పోటీ ఇస్తుందా అనే అంచనాలు మొదలయ్యాయి.
సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం మాట్రాన్. అవిభక్త కవలల నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రదర్శ్ అనే టైటిల్ పెడితేనే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తొలిసారిగా సూర్య తన వాయిస్ ని తెలుగువారికి వినపించనున్నారు. తనే తన పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. గబ్బర్ సింగ్ ఘన విజయంతో ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో జరిగింది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్ కామెంట్ చేసినట్టు చెబుతున్నారు.
మరో ప్రక్క వచ్చే నెలలో నాగార్జున,పవన్ కళ్యాణ్ సైతం భాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. ఇద్దరి సినిమాలూ దసరాకే విడుదల చేసి అభిమానులుకు ఆనందం పంచటానికి సిద్దమవుతున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ ఢమరుకం చిత్రం అక్టోబర్ 12న విడుదల అవుతూంటే,పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం అక్టోబర్ 11 న విడుదల అవుతున్నాయి. అయితే ధియోటర్స్ సమస్యను ఎలా ఈ మూడు సినిమాలు సాల్వ్ చేసుకుని,పోటీ పడతాయో చూడాలి అంటున్నారు.


Click it and Unblock the Notifications











