రాజమౌళితో వర్క్ చేస్తే క్రెడిట్ రాదు.. అందుకే RRR నుంచి తప్పుకున్నాం: రామ్ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో వర్క్ చేయడానికి ఎవరికైనా సరే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఆయనకు ఎక్కువగా కనెక్ట్ అవ్వాలకపోతుంటారు. అందుకు ఒక మంచి కారణం కూడా ఉంది. ఇక ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అందుకు సంబంధించిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా రాజమౌళితో వర్క్ చేస్తే ఎవరికి క్రెడిట్ అంతగా రాదని కూడా అన్నారు. ఆ విషయంలో కూడా ఒక మంచి అర్థమే ఉందని తెలియజేశారు.

మనసున్న మాస్టర్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణ్ అంటే వారి గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుతుంటారు. మంచి ఫైట్ మాస్టర్స్ కంటే కూడా ముందుగా వాళ్ళు కల్మషం లేని మంచి మనుషులని చెప్పవచ్చు. దాదాపు ఇండస్ట్రీలో అందరి హీరోలతో వర్క్ చేసిన అనుభవం ఉంది. వీలైనంత వరకు హీరోలకు తగ్గట్లుగానే వారి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఫైట్స్ కంపోజ్ చేస్తుంటారు.

సామజిక సేవలో కూడా
వాళ్ళు ఏ రోజు బడికి వెళ్లి చదువుకోలేదు. కనీసం సంతకం చేయడం రాకపోయినా కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేస్తుంటారు. గత 20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. ఇక వారు సంపాదించే వాటిలో కొంత సామజిక సేవకు ఉపయోగిస్తుంటారు. వారు మాంసం కూడా ముట్టుకొరు. అలాంటి జీవన శైలిని అలవాటు చేసుకొని పాజిటివ్ గా ఉంటున్నారు.

RRR నుంచి తప్పుకున్నాం
ఇక ప్రస్తుతం అందరూ ఫైట్ మాస్టర్స్ కూడా పాన్ ఇండియా ఆఫర్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి సినిమాలు వస్తే చేతిలో ఎన్ని లోకల్ సినిమాలున్నా కూడా వదిలేసుకుంటున్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళితో ఆఫర్ వస్తే ఎవరు కూడా వధులుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది రామ్ లక్ష్మణ్ RRR నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చారు.

అలా ఉంటే రాజమౌళికి ఇష్టం ఉండదు
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి మాట్లాడుతూ.. రాజమౌళితో మేము చాలా సినిమాలకు వర్క్ చేశాం. విక్రమార్కుడు సినిమాకు బెస్ట్ ఫైట్స్ కంపోజ్ చేశాము. అయితే ఆ తరువాత కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. రాజమౌళి గారు పెద్ద సినిమాలు చేస్తుంటారు కాబట్టి టెక్నీషియన్స్ ఆయనకు తగ్గట్లుగానే ఉండాలి. ఎవరైనా బిజీగా ఉంటే వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఆయనకు ఇష్టం ఉండదు.. అన్నారు.

డేట్స్ అడ్జస్ట్ అవ్వాకపోవడం వలన
మాకు కూడా పెద్ద సినిమాలు చేయాల్సి వస్తే 50రోజులు ఒక్క సినిమాకే వర్క్ చేయాలి కాబట్టి మిగతా నాలుగైదు సినిమాలను వదులుకోవాల్సి వస్తోంది. అందుకే మరీ అంత లాంగ్ షెడ్యూల్ ఉండే సినిమాలు చేయడం తగ్గించాము. RRRకు కూడా చేయాలని అనుకున్నాము కానీ రామ్ చరణ్ కు ఆ మధ్య గాయం కారణంగా షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో మళ్ళీ మాకు వాళ్లకు డేట్స్ అడ్జస్ట్ అవ్వాకపోవడం వలన తప్పుకోవాల్సి వచ్చింది.. అని చెప్పారు.
Recommended Video

రాజమౌళితో వర్క్ చేస్తే క్రెడిట్ రాదు
ఇక రాజమౌళితో వర్క్ చేస్తే ఫైట్ మాస్టర్స్ కు అంతగా క్రెడిట్ ఉండదు. ఎందుకంటే ప్రతి షాట్ లో కూడా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. సీన్ కు తగ్గట్లుగానే కంపోజ్ చేయిస్తారు కాబట్టి ఫైట్ మాస్టర్స్ కంటే ఎక్కువ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఆయన చాలా కష్టపడతారు.
అందులో ఎలాంటి సందేహం లేదు.. అని రామ్ లక్ష్మణ్ వివరణ ఇచ్చారు. అంతే కాకుండా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచం ముందు నిలబెట్టారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు మాట్లాడారు.


Click it and Unblock the Notifications











