పవన్‌తోనే అమీతుమీ... నాగ్ ‘డమరుకం’ 19న

By Bojja Kumar

హైదరాబాద్: కింగ్ నాగర్జున తన తాజా సినిమా 'డమరుకం' విషయంలో అటు తిరిగి ఇటు తిరిగి చివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనే అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసారు. ఇందుకు ఒక రోజు ముందుక అంటే అక్టోబర్ 18న పవన్ కళ్యాణ్ నటించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం విడుదలవుతోంది.

డమరుకం చిత్రం విడుదల గురించి ఆ చిత్ర నిర్మాత డా.వెంకట్ మాట్లాడుతూ...తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త చిత్రంగా నిలిచిపోయే డమరుకం 19న విడుదల చేస్తున్నామని, 10కి తొలి కాపీ వస్తే 11న సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేస్తామని, నాగార్జున కెరీర్‌లోనే ఎక్కువ థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం గతంలో చూడని గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను అలరించనుందని, దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం మంచి ఆదరణ పొందిందని తెలిపారు.

అనుష్క, ప్రకాష్‌రాజ్, గణేష్‌వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. ప్రకాష్‌ రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X