90 కోట్లు తమిళ ఫైటర్స్ కే ..

తెలుగు ఫైటర్లకు న్యాయం జరగాలని కోరుతూ యూనియన్ సభ్యులు సోమవారం ఫిల్మ్‌చాంబర్ బయట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అంతకుముందు వారు యూనియన్ కార్యాలయం నుంచి, ఫిల్మ్‌చాంబర్ వరకు ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం వద్ద జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు పి. సతీష్ మాట్లాడుతూ "చెన్నై ఫైటర్స్ వల్ల మాకు పని తక్కువైపోయింది.తెలుగు సినిమాల్లో 50 శాతం తెలుగు ఫైటర్స్, 50 శాతం తమిళ ఫైటర్స్‌ని ఉపయోగించుకునేలా గతంలో నిర్ణయం జరిగింది. దీన్ని తమిళ ఫైట్‌మాస్టర్లు ఉల్లంఘిస్తున్నారు. రామ్-లక్ష్మణ్, విజయ్, శ్రీకాంత్, రవికాంత్, హార్స్‌మన్‌బాబు, గణేష్ వంటివాళ్లు తమిళ యూనియన్ సభ్యులుగా కొనసాగుతూ తమిళ ఫైటర్లనే వుపయోగించుకోవడం శోచనీయం. వీరిలో చాలామంది తెలుగువారైనా తెలుగు ఫైటర్లకి అన్యాయం చేస్తున్నారు.
తెలుగు ఫైటర్లకి న్యాయం జరిగేలా చూడమని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఫిల్మ్‌చాంబర్‌లకు విజ్ఞప్తి చేశాం. మావి కనీస కోరికలుగా వారు గుర్తించినా, న్యాయం మాత్రం చేయలేక పోతున్నారు. మా సమస్య పరిష్కారానికి సహకరించమని అడిగినప్పుడు అంగీకరించి, 45 రోజులుగా తెలుగు సినిమాలకు పనిచేయని తమిళ ఫైట్‌మాస్టర్లు తిరిగి సెప్టెంబర్ 22 నుంచి పనిచేస్తామని చెప్పడంతో గత్యంతరం లేక న్యాయం కోసం ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టాం'' అని వివరించారు.
యూనియన్ సలహాదారు నాగరాజు,ఫైట్‌మాస్టర్‌రమణ ప్రసాద్ మాట్లాడుతూ, ఏడాదికి వంద కోట్ల రూపాయల యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తే, వాటిలో 90 కోట్ల రూపాయలను తమిళ ఫైటర్సే తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











