twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జైబోలో తెలంగాణ’ నంది అవార్డుపై కోర్టుకు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'జై బోలో తెలంగాణ' చిత్రానికి నంది అవార్డు ఇవ్వడంపై కొంత కాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంతో రూపొందిన ఈ చిత్రానికి నంది అవార్డు ఏమిటని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు వరకు వెళ్లింది.

    వేర్పాటు వాదంతో తీసిన ఈ చిత్రానికి ప్రకటించిన నంది అవార్డు పురస్కారాన్ని రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్లే అడుసుమిల్లి జయప్రకాష్ కోర్టు కెక్కారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తోనే సమస్యలు తీరుతాయని ఈచిత్రంలో చూపించారని, దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయని వెంటనే ఈ చిత్రానికి ప్రకటించిన అవార్డుతో పాటు, దర్శకుడు శంకర్ కి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకోవాలని పిటీషన్లో కోరారు.

    ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుందో అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2011 సంవత్సరానికి గాను 'జై బోలో తెలంగాణ'కు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు లభించింది. ఇదే చిత్రానికి ఎన్.శంకర్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు, గద్దర్‌కు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు లభించాయి.

    జైబోలో తెలంగాణ చిత్రానికి ఎన్ శంకర్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు, స్మృతి ఇరానీ, మీరా నందన్, చంద్రశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4, 2011న విడుదలైంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది.

    English summary
    Ex MLA Adusumilli Jayaprakash filed petition on Nandi awards for Jai Bolo Telangana film. Showing a copy of the film’s screenplay, Mr. Jayaprakash said the movie, which provoked regional differences, should never have been selected for the award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X