రాజీవ్ గాంధీ హత్య కుట్రపై రామ్ గోపాల్ వర్మ శిష్యుడు చిత్రం
రామ్ గోపాల్ వర్మ దగ్గర..ఏక్ హసీనా ధీ, మిస్టర్ యా మిసెస్, నిశ్శబ్ద్ చిత్రాలకు అశోసియేట్ గా పనిచేసిన సురిందర్ హివరలే త్వరలో దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంతో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. పిబ్రవరి నెలాఖరులో గానీ, మార్చి మొదటివారంలో గానీ షూటింగ్ కి వెళ్ళే ఈచిత్రం ప్రముఖ పాత్రికేయుడు రాజీవ్ శర్మ రాసిన ఓ పుస్తకం ఆధారంగా చిత్ర కథ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయమై సురిందర్ హివరలే మాట్లాడుతూ...నేను గత తొమ్మిది నెలలుగా ఈ స్క్రిప్టు పనులోనే బిజీగా ఉన్నాను. పూర్తి సంతృప్తిగా స్క్రిప్టు వచ్చాకే షూటింగ్ కి వెళ్ళాలనుకున్నాను. ఆ దశ వచ్చింది. వర్మ శిష్యుడిగా నేను ఎప్పుడూ గర్వపడుతూంటాను. ఆయన గతంలో తీసిన కల్ట్ ఫిలింల తరహాలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. షూటింగ్ లో ఎక్కువ భాగం శ్రీలంక, ఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో జరుపుతాం. కథలో కొన్ని కీలక సన్నివేశాల్ని ఇటలీలోనూ తెరకెక్కిస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











