»   »  ఇక జీవితంలో మళ్లీ సినిమాలు చేయకుండా చేశారు!

ఇక జీవితంలో మళ్లీ సినిమాలు చేయకుండా చేశారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'డేరా సచ్చా సౌధా' అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రేప్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. కోర్టు అతడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. గుర్మీ కేవలం బాబాగా మాత్రమే కాదు.... సినిమా రంగంలో దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, రైటర్‌గా, స్టంట్ మాస్టర్‌గా. సంగీత దర్శకుడిగా ఇలా సినిమా రంగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నీ చేశాడు.

20 సంవత్సరాల జైలు శిక్ష పడిన నేపథ్యంలో సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా) బాబా వర్క్‌పర్మిట్‌ను రద్దు చేసింది. ఇంతేకాదు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిడిఎ) రామ్ రహీంతో పాటు అతని కూతురుగా చెప్పుకుంటున్న హనీప్రీత్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది.

Film bodies cancel membership of rape convict Gurmeet Ram Rahim

'డేరా సచ్చా సౌధా' అనే ఆధాత్మిక సంస్థ అధినేత, 'మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా హీరో..... రాక్ స్టార్ బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అరెస్టుతో ఉత్తరాది రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అతడిపై రేప్ కేసు రుజువుకావడంతో సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది.

English summary
Two film bodies, Indian Film and Television Directors’ Association (IFTDA) and Cine and TV Artists Association (CINTAA), have decided to take strong action against now jailed Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu