'యాగం' దర్శకుడుపై మండిపడుతున్న ఫిల్మ్ ఛాంబర్?
నవదీప్, భూమిక,కిమ్ శర్మ కాంబినేషన్ లో మొన్న రిలీజైన 'యాగం' చిత్రంపై ఫిల్మ్ ఛాంబర్ మండిపడుతోంది. ఓ వారం క్రిందట నిరాహార దీక్షలు చేసి, తెలుగు చిత్ర పరిశ్రమ అంతా పైరసీపై యుధ్దం ప్రకటించి ప్రభుత్వం నుంచి హామీలు పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే యాగం చిత్రంలో ఓ పాత్ర చేత పైరసీ గురించి ఓ డైలాగ్ చెప్పించారు. అదేమిటంటే...డైరక్టర్స్,ప్రొడ్యూసర్స్ ఇంగ్లీష్ సినిమాలు కాపీచేసి తెలుగు సినిమాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ సినిమాలను పైరసీ వెర్షన్ లో చూడటం తప్పు లేదు..అన్న అర్ధం వచ్చేలా డైలాగ్ ఉంది. దాంతో తాము చిత్త శుద్దితో చేస్తున్న పోరాటానికి ఈ డైలాగ్ కించపరస్తున్నట్లు అవుతుందని ఫిల్మ్ ఛాంబర్ జన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి త్వరలో ఆ డైలాగ్ ని సినిమా నుంచి తీసేయమని దర్శక,నిర్మాతలపై వత్తిడి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తమ్ముడు వంటి హిట్ తో వరసగా చేస్తున్న దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఈ యాగం చిత్రాన్ని రూపొందించారు. ఇక తమ్ముడు చిత్రం కూడా హిందీలో అమీర్ ఖాన్ చేసిన సూపర్ హిట్ చిత్రానికి కాపీనే అన్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన...జగపతి బాబు, నీలిమలతో రూపొందించిన మా నాన్న చిరంజీవి చిత్రం కూడా పర్షూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే హాలీవుడ్ చిత్రం నుంచి లిప్ట్ చేసిదేనన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











