‘కబాలి’ఆపండి..చట్ట విరుద్ద ప్రదర్శన, ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం
బెంగుళూరు: ఫైవ్ స్టార్ హోటల్స్ లో కబాలి చిత్ర ప్రదర్శన జరగటానికి అన్ని ఏర్పాట్లు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు కర్ణాటక స్టేట్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అశోశియేషన్ వారు ఈ విషయమై హోం డిపార్టమెంట్ వరకూ తీసుకు వెళ్లి..చట్టవిరుద్ద ప్రదర్శనగా ఫైవ్ స్టార్ హోటల్స్ లో సినిమాని ప్రదర్శించటం ఆపాలని కోరారు.
ఈ విషయమై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కెవి చంద్రశేఖర్ మాట్లాడుతూ... స్క్రీన్ లేదా ధియేటర్స్ లో మాత్రమే ఈ చిత్రం ప్రదర్శించాలని సెంట్రల్ బోర్డ్ ఇష్యూ చేసిన సెన్సార్ సర్టిఫికేట్ లో ఉందని తెలియచేసారు. మేము ఇప్పటికే ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాం. ప్రభుత్వం ఈ విషయంలో చర్య తీసుకోలేకపోతే మేం లీగల్ గా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కన్నడ రైట్స్ తీసుకున్న లహరి మ్యూజిక్ చంద్ర కుమార్ ఆలోచన ఇది. ఆయన యుఎస్ మోడల్ లో ఈ ప్రయత్నం మొదలెట్టారు. కర్ణాటకలోని మేజర్ సిటీల్లోని ఫైవ్ స్టార్ హోటళ్లలలో ఈ సినిమాని ప్రదర్శించాలని ప్లాన్ చేసారు.
ఇక కర్ణాటకలో ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా ..ప్లాస్టిక్ కుండలని పంపిణీ చేసారు. ఆ కుండలకు కబాలి స్టిక్కర్స్ ఉంటాయి. నీళ్లు పట్టుకోవటానికి ఆడవాళ్లు ఈ ప్లాస్టిక్ బిందె పట్టుకెళ్లినప్పుడు కబాలి పబ్లిసిటీ జరుగుతుందని కర్ణాటక రాజ్య రజనీ సేవా సమితి వారు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











