డాకు మహరాజ్, హిట్ 3 డిజాస్టర్ చిత్రాలే.. ఫిల్మిం ఛాంబర్ సెక్రెటరీ ఘాటు విమర్శలు
తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న చిత్రాలు మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. కేవలం తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఇతర భాషల్లోని ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలకైతే నెక్ట్స్ లెవల్లో డిమాండ్ ఉంటోంది. అయితే 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్నీ చిత్రాలు మంచి రిజల్ట్ నే అందుకున్నాయి. మేకర్స్ కూడా తమ సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయని ప్రకటించారు. అయితే తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నూతన సెక్రటరీ ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అని అన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో సింగిల్ థియేటర్స్ వివాదం..
ఓవైపు తెలుగు సినిమా ప్రతిష్టతను పెంచేందుకు స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎంతగా కృషి చేస్తున్నారో తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ ఫిల్మ్ మార్కెట్ లో తెలుగులో సినిమాకు భారీ డిమాండ్ ఉండటం శుభ పరిణామం. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు.. ఈ పరిణామానికి ఏందరో త్యాగం, కృషి, ముందు చూపు, సాహసోపేతమైన నిర్ణయాలు, అద్భుతమైన నైపుణ్యమే కారణం. ఇక ప్రస్తుతం వరల్డ్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని పాన్ వరల్డ్ సినిమాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరోవైపు టాలీవుడ్ లో సింగిల్ స్క్రీన్స్ పేరుతో ఓ వివాదం మొదలైంది. సింగిల్ స్క్రీన్స్ ను బతికించాలని కొందరు ఎగ్జిబిట్లర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండు వర్గాలుగా ఏర్పడి థియేటర్లను బంద్ చేస్తామనే వరకూ వెళ్లారు. కానీ తర్వాత సమస్య సర్దుమణిగింది. ప్రస్తుతం థియేటర్ల బంద్ లేకుండా కొనసాగుతున్నాయి.

డాకూ మహారాజ్, హిట్ సినిమాలు డిజాస్టర్..
సింగిల్ థియేటర్స్ వివాదంపై తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ స్పందించారు. సింగిల్ స్క్రీన్స్ కొనసాగింపు భారంగా ఉందనే విషయంపై మాట్లాడుకొచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ, నేచురల్ స్టార్ ని హిట్ 3 సినిమాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025లో ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో కేవలం 3 సినిమాలు మాత్రమే విజయవంతం అయ్యాయని, మిగితావన్నీ డిజాస్టర్ అయ్యాయని ప్రెస్ మీట్ లో చెప్పడం హాట్ టాపిక్ గ్గా మారింది.
ఆయన మాట్లాడుతూ.. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో కేవలం 3 సినిమాలే హిట్ అయ్యాయి. అవి కూడా సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ 2, కోర్టు సినిమాలే విజయవంతం అయ్యాయి. మిగితావన్నీ ఆడలేదు. ఇక సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉండాలి. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారంటూ' మాట్లాడుకొచ్చారు.
ఇక గోపీచంద్ మాలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'డాకూ మహారాజ్' చిత్రం రూ.100 కోట్లతో నిర్మించారు. కాగా బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు కలెక్ట్ చేసింది. నేచురల్ స్టార్ నాని - శైలేష్ కొలను కాంబినేషనల్ లో వచ్చిన హిట్ 3 చిత్రం రూ.65 కోట్లతో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు చిత్రాలు ఓటీటీలోనూ దుమ్ములేపాయి. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.


Click it and Unblock the Notifications











