జూ ఎన్టీఆర్ కూడా పిచ్చి సినిమాలు చేశాడు, దేవుడు అంటే మూర్ఖత్వమే: కత్తి మహేష్

By Bojja Kumar

Recommended Video

జూ ఎన్టీఆర్, నాని పై.. కత్తి మహేష్ సంచలన కామెంట్స్..

పవన్ కళ్యాణ్ ఇష్యూలో మహేష్ కత్తి ఈ మధ్య హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలతో మొదలై అతడి రాజకీయ పరమైన మూమెంట్స్ పైన కత్తి మహేష్ తరచూ విమర్శనాత్మకంగా తన అభిప్రాయాలు చెబుతూ పవర్ స్టార్ అభిమానుల దృష్టిలో విలన్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ జూ ఎన్టీఆర్, నాని మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Vote here : 2017 సంవత్సరపు ఉత్తమ హీరో ఎవరు?

Vote here : 2017 సంవత్సరంలో టాలీవుడ్ ఉత్తమ నటి ఎవరు?

 నాని, ఎన్టీఆర్...

నాని, ఎన్టీఆర్...

తెలుగులో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? అనే ప్రశ్నకు కత్తి మహేష్ స్పందిస్తూ..... తెలుగులో ఉన్న వారిలో నాని గుడ్ యాక్టర్, తారక్ గుడ్ యాక్టర్, వీరిద్దరూ నాకు బెటర్ అనిపిస్తారు. బాలీవుడ్ నుండి ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధీఖీ, అక్షయ్ కుమార్ కూడా ఈ మధ్య మంచి సినిమాలు చేస్తున్నారు... అని కత్తి మహేష్ తెలిపారు.

 తారక్‌ను అభిమానించడం లేదు

తారక్‌ను అభిమానించడం లేదు

నేను తారక్‌(జూ ఎన్టీఆర్)ను అభిమానిస్తున్నానని చెప్పడం లేదు, అలాంటపుడు ఇతర హీరోల అభిమానులు ఆయన్ను ఏమన్నా అంటే నాకు ఎందుకు కోపం వస్తుంది... అని కత్తి మహేష్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

 అతడి స్టార్ వ్యాల్యూ నాకు అక్కర్లేదు

అతడి స్టార్ వ్యాల్యూ నాకు అక్కర్లేదు

తారక్ సినిమాలను చూస్తాను. అతడి సినిమా బావుంటే బావుందని చెబుతాను, బాగోలేకుంటే బాగోలేదని చెబుతాను. అందులో ఫేవరటిజం ఏముంది? అతడు బెస్ట్ యాక్టర్ అంటున్నాను. అతడి స్టార్ వ్యాల్యూ నాకు అక్కర్లేదు. అతడి సినిమాను బట్టే నాకు అతడి మీద అభిమానం ఉంటుంది.... అని కత్తి మహేష్ తెలిపారు.

పిచ్చి సినిమాలు కూడా చేస్తున్నాడు

పిచ్చి సినిమాలు కూడా చేస్తున్నాడు

తారక్ సినిమాలు బాగోలేకుంటే ఎందుకు అతడు పిచ్చి సినిమాల్లో నటిస్తున్నాడని ఇప్పటికీ అంటాను. అతడు బెటర్ యాక్టరే... అతడు ఎంచుకునే పాత్రలు బావుంటే బావుందని చెబుతాను, బాగోలేకుంటే బాగోలేదని చెబుతాను. ఇది నా స్థిరమైన అభిప్రాయమని... కత్తి మహేష్ తెలిపారు.

 నాని డిసప్పాయింట్ చేశాడు

నాని డిసప్పాయింట్ చేశాడు

హీరో నాని ఈ మధ్య నాలుగైదు సినిమాలు రిపీటెడ్ గా అదే యాక్టింగ్ చేస్తున్నాడు. అలాంటపుడు డిసప్పాయింట్ అయ్యాను. అతడు మంచి యాక్టర్ అయినంత మాత్రాన అన్ని సినిమాల్లో మంచిగా చేస్తున్నాడు... అతన్ని నేను ఆరాధించేస్తున్నాను అని ఎప్పటికీ అనను అని కత్తి మహేష్ తెలిపారు.

దేవుడు అంటే మూర్ఖత్వమే

దేవుడు అంటే మూర్ఖత్వమే

ఏ హీరోను అయినా దేవుడు అంటే మూర్ఖత్వం అవుతుంది. నేను సినిమాను సినిమాగా చూస్తాను. సినిమాలో ఎంత బాగా చేశాడనేది చూస్తాను. అన్ని సినిమాల్లో అందరూ నటులూ బ్రహ్మాండంగా చేయక పోవచ్చు. దాని గురించి కూడా నేను మాట్లాడతాను. విశ్లేషనాత్మకంగా నా అండర్ స్టాండింగ్ ఉంటుంది తప్ప బ్లైండ్ ఫెయిత్ లాగా ఉండదు. బ్లైండ్ ఫెయిత్ అనేది ఎవరికైనా నష్టమే. రాజకీయ నాయకులైనా, సినిమా యాక్టర్లనైనా వాళ్లను దేవుళ్లు అంటే వాళ్లకూ నష్టం, మనకూ నష్టం.... అని కత్తి మహేష్ తన అభిప్రాయం వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X