twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత ఊరిలో కత్తిమహేష్ అంత్యక్రియలు పూర్తి.. హైకోర్టులో విచారణ జరిపించాలని డిమాండ్

    |

    సీని నటుడు, విమర్శకుడు కత్తిమహేష్ ఇటీవల తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహేష్ గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో పోరాడుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఇక ఆయన అంత్యక్రియులు ఆయన సొంత ఊరు చిత్తూరు జిల్లా యలమంద గ్రామంలో సోమవారం జరిగాయి. కత్తి మహేష్ కు నివాళులర్పించేందుకు
    బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భారీ స్థాయిలో తరలి వచ్చారు.

    కడసారిగా కన్నీటి వీడ్కోలు తెలుపుతూ కత్తి మహేష్ మృతి పట్ల నివాళులు అర్పించారు. పలువురు రాజకీయ నాయకులు కూడా కత్తి మహేష్ కు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మాల/మాదిగ నేతలందరు కూడా భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు తరలివచ్చారు. ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రెల్లి కార్పోరేషన్ ఛైర్మన్ మధుసూదన్ రావు కూడా కత్తి మహేష్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

    Film critic Kathi Mahesh funeral completed

    ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కత్తి మహేష్ ను కాపాడుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించారని మాట్లాడారు. అలాగే మహేష్ కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయని, వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తీరాలని మందకృష్ణ మాదిగ తీవ్రంగా డిమాండ్ చేశారు. గత నెల నెల్లూరులోని చంద్రశేఖరపురం హైవేపై కత్తి మహేష్ కారు అదుపు తప్పి ఒక లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఒక కన్నుకు తలకు బలమైన గాయం కావడంతో కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ తీసేశారని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ ఆరోపణలతో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

    English summary
    Film critic and Diector Kathi Mahesh died due to Pulmonary embolism. Many of his friends are shocked to his death news, His funerals will conducted at Vayalpadu of Chittor. Here is Som details of his wife Sonali and family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X