twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ కత్తి: బిగ్ బాస్‌తో మొదలై.. పవన్‌తో యుద్దం దాకా..

    |

    ఈ ఏడాది అనూహ్యంగా తెరపైకి వచ్చిన కొత్త ముఖాల్లో మహేష్ కత్తి ఒకరు. నిజానికి లిటరరీ, ఫిలిం సర్కిల్స్‌లో ఆయనకు అప్పటికే కొంత గుర్తింపు ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ షో ద్వారా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు.

    పర్ణశాల అనే బ్లాగులో బహుజన దృక్పథంతో ఆయన రాసిన వ్యాసాలు, ఆయన ఆలోచనా విధానం మహేష్ కత్తికి అంబేడ్కరిస్టు అన్న గుర్తింపునిచ్చింది. ఎప్పుడైతే ఆయన సినీ విమర్శపై సీరియస్‌గా దృష్టి పెట్టి.. 10టీవి ద్వారా రివ్యూలు చెప్పడం మొదలుపెట్టారో అప్పటినుంచి సినీ ఇండస్ట్రీలోను ఆయన గురించి సీరియస్‌గా చర్చ మొదలైంది.

    film critic mahesh kathi journey in 2017

    ఇక ఎప్పుడైతే ఆయన పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' సినిమాపై రివ్యూ చెప్పారో.. అప్పటి నుంచి ఆయనకు పవన్ అభిమానులకు మధ్య ఇంకా వార్ నడుస్తూనే ఉంది. అది కాస్త ముదిరి పాకాన పడి
    మహేష్ కత్తి చేత రాజకీయ విమర్శలకూ దారితీసింది. రాజ్యాంగ పరిధికి లోబడే తాను విమర్శిస్తున్నానని కత్తి మహేష్.. అనవసరంగా అతన్ని పెద్దవాడిని చేయవద్దంటూ మెగా కాంపౌండ్.. ఈ వివాదం ఇలా సాగుతూనే ఉంది.

    ఫిలిం క్రిటిక్‌గా మాత్రమే కాక ఈ ఏడాది ఎగిరే తారాజువ్వలు పేరిట చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ కోసం మహేష్ కత్తి ఒక సినిమా కూడా తీశారు. పవన్ ఫ్యాన్స్ అనవసరంగా తన జీవితాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి.. ప్రజారాజ్యం సమయంలోనే బహుజనులకు ఒకసారి ద్రోహం జరిగింది కాబట్టి.. బహుజనులు మళ్లీ మోసపోకుండా ఉండటానికి తానొక కామన్ మ్యాన్‌గా పవన్ రాజకీయాలపై కామెంట్స్ చేస్తూనే ఉంటానని ఆయన కుండ బద్దలు కొడుతున్నారు.

    English summary
    Mahesh Kathi is a film critic and actor working in Telugu cinema. He appeared in the reality TV show Bigg Boss Telugu. He studied film theory in HCU.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X