6 జాతీయ అవార్డులు ఆయన సొంతం.. ప్రముఖ తెలుగు దర్శకుడు కన్నుమూత!
ప్రముఖ దర్శకులు, సినీ కెఎన్‌టి శాస్త్రి శాస్త్రి తుదిశ్వాస విడిచారు. 6 జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఘనత ఆయన సొంతం. దర్శకుడిగా తెలుగు, కన్నడ భాషల్లో చిత్రాలు తెరకెక్కించారు. ఆయన రూపొందించే చిత్రాలు కమర్షియల్ అంశాలతో కాకుండా సందేశాత్మకంగా ఉండేవి.
ఆయన దర్శత్వం వహించిన తిలదానం, సురభి చిత్రాలు జాతీయ వార్డులు సొంత చేసుకున్నాయి. ఆయన దర్శత్వంలో వచ్చిన మరో చిత్రం కమిలి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఈ కమిలి చిత్రాన్ని బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.

ఆయన కమర్షియల్ చిత్రాలకంటే సందేశాత్మక చిత్రాలు తీయడానికే ఇష్టపడేవారు. అదే తనకు ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినీ విమర్శకుడిగా ఆయన పలు రచనలు సైతం చేశారు.


Click it and Unblock the Notifications