Bhagavanth Kesari First Review: భగవంత్ కేసరి రివ్యూ చెప్పిన క్రిటిక్.. 2023 బాలయ్యదే అంటూ!
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ డూపర్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ', 'వీర సింహా రెడ్డి' చిత్రాలతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇదే ఊపులో ఇప్పుడు 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చాడు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో మీరే చూసేయండి మరి!
భగవంత్ కేసరిగా బాలకృష్ణ
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే 'భగవంత్ కేసరి'. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ ఇందులో విలన్‌గా చేశాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

అంచనాలు తగ్గట్లే బిజినెస్
ఇద్దరు స్టార్లు కలిసి చేసింది కావడంతో.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'భగవంత్ కేసరి' చిత్రాన్ని రూపొందించారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో కలిపి భారీ స్థాయిలోనే బిజినెస్ జరిగింది.

రిలీజ్‌కు రెడీ.. ట్రెండింగ్‌లో
'భగవంత్ కేసరి' మూవీని అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. దీంతో భగవంత్ కేసరి సందడి క్రమంగా పెరిగి.. ఇది ట్రెండింగ్‌లో ఉంటోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణలో ఈ సినిమా హడావిడి కనిపిస్తోంది.
సెన్సార్ పూర్తి.. క్రేజీ టాక్‌తో
విభిన్నమైన కాంబినేషన్‌లో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇది డీసెంట్ రన్ టైంతోనే వస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రంపై సెన్సార్ సభ్యులు మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం రిలీజ్‌కు ముందే క్రేజీ టాక్ వచ్చింది.

ఈ మూవీపై ఉమైర్ ట్వీట్
నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా సామాన్య సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న టాప్ క్రిటిక్స్ దీని గురించి పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫేమస్ క్రిటిక్ ఉమైర్ సంధు భగవంత్ కేసరి మూవీపై ట్వీట్ చేశాడు.

ఈ ఏడాది బాలయ్యదే అని
తన రివ్యూలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉమైర్ సంధు తాజాగా 'భగవంత్ కేసరి' మూవీ గురించి ట్వీట్ చేశాడు. అందులో 'భగవంత్ కేసరి సినిమా సెన్సార్ స్క్రీనింగ్ పూర్తి అయింది. 2023వ సంవత్సరం నందమూరి బాలకృష్ణదే' అని పేర్కొన్నాడు. తద్వారా సినిమా చాలా బాగుందని చెప్పాడు. దీనిపై నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











