'ఆమే నా భార్యే' ... నన్ను బెదిరించారు: డైరక్టర్ గోల

By Srikanya

బెంగళూరు : కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌ గౌడ తనను వివాహం చేసుకుని ఇప్పుడు వేరే యువతితో పెళ్లికి సిద్ధపడుతున్నాడని న్యాయస్థానం మెట్లెక్కిన నటి, రూపదర్శి మైత్రేయి కేసు కొత్త మలుపు తిరిగింది. మైత్రేయి తన భార్య అంటూ దర్శకుడు రిషి బెంగళూరులోని మూడో ఏసీఎంఎం న్యాయస్థానంలో మంగళవారం ఫిర్యాదు చేశారు.

''సూర్య ది గ్రేట్‌'' సినిమా చిత్రీకరణ సమయంలో (2004) ఆమెతో పరిచయమైందని, శేషాద్రిపురంలోని సన్మాన్‌ హోటల్‌లో ఆమెను 2008లో వివాహం చేసుకున్నానని, ప్రస్తుతం ఆమె తనకు దూరంగా ఉంటోందని అర్జీలో పేర్కొన్నారు. ఆమె తనతో కలిసి సంసారం చేసేలా ఆదేశాలివ్వాలంటూ అర్జీలో విజ్ఞప్తి చేశారు. ఈ అర్జీ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Film director says Maitreya married him a decade ago

మైత్రేయిగౌడ తన భార్యగా ప్రకటించి కోర్టులో కేసు వేసిన దర్శకుడు రిషి మంగళవారం సాయంత్రం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తనకు మైత్రేయిగౌడ 2004 నుంచి పరిచయమని, 2008లో వివాహం చేసుకుని, నాలుగు నెలల పాటు సంసారం చేశామన్నారు. జీవితంలో స్థిరపడిన తరువాత తమ వివాహ బంధాన్ని అందరి ముందు ప్రకటిద్దామని ఆమె సూచించిందన్నారు.

తాము తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటామని, ఆగస్టు 27వ తేదీ ఉదయం కూడా ఆమెతో మాట్లాడానని తెలిపారు. వివాహ విషయాన్ని ప్రస్తావించవద్దని ఆమె బెదిరించి ఫోన్‌ పెట్టేసిందని, మంగళవారం ఉదయం కూడా 080-255994309 నంబరు నుంచి ఓ రౌడీషీటరుతో ఆమె తనకు ఫోన్‌ చేయించి బెదిరించిందని ఆరోపించారు. దీనిపై వయ్యాలికావల్‌ ఠాణాలో ఫిర్యాదుకు యత్నించగా పోలీసులు నిరాకరించారని, అందుకే కోర్టును ఆశ్రయించానని వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X