సినీ షూటింగులకు ఇక నో బ్రేక్, సమ్మె విరమించిన చలనచిత్ర కార్మికులు
తెలుగు సినిమా షూటింగులు రేపటి నుంచి (మంగళవారం నుంచి) తిరిగి ప్రారంభం కానున్నాయి. చలన చిత్ర నిర్మాతల మండలి కార్మికులను డిమాండ్‌ను అంగీకరించింది. దీంతో సమ్మె విరమించాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. కార్మికుల సమ్మె విరమమతో గత 18 రోజులుగా ఆగిపోయిన సినిమాల షూటింగులు తిరిగి ప్రారంభం కానున్నాయి. కార్మికులకు 32 శాతం వేతనాలు పెంచడానికి నిర్మాతల మండలి అంగీకరించింది.
వేతనాల పెంపుపై ఫెడరేషన్‌లోని కొన్ని సంఘాలు మొండిపట్టు పట్టాయి. తాము అడిగినంత మేర వేతనాలు పెంచాల్సిందేనని పట్టుబట్టాయి. దాంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. సోమవారం జరిగిన చర్చల్లో నిర్మాతల మండలి దిగి రావడంతో పరిష్కారం లభించింది.


Click it and Unblock the Notifications











