ప్రముఖ వజ్రాల వ్యాపారస్ధుడు,ఫిల్మ్ ఫైనాన్సియర్ అయిన భరత్ షాని ముంబయి పోలీసులు నిన్న(గురువారం) ఆయన ఇంటి వద్దే అరెస్టు చేసారు. సిల్వాసా కోర్టు ఇష్యూ చేసిన అరెస్టు వారెంటులో మోసం,ఆస్ధుల దుర్వినియోగం వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. విశాల్ ఛైర్స్ అనే కంపెనీ రెండు వేలవ సంవత్సరంలో నమేదు చేసిన కంప్లైంటుకు ఇప్పుడు విచారణ జరిపి అరెస్టు వారెంటు ఇష్యూ చేసారు.ఇక షా అడ్వకేట్ ఐఎ భగీరయా ఈ విషయంపై గారగామ్ మెట్రో పోలటీన్ మెజిస్ట్రేట్ వద్ద వాదించాడు. అయినా ఫలితం లేకపోయింది. అనంతరం మెజిస్ట్రేట్ బెయిల్ రిజెక్టు చేసి సెసెన్స్ కోర్టుకు అటెండవ్వాలని చెప్పటం జరిగింది. గతంలో (2003)లో ఒక సంవత్సరం పాటు అండర్ వరల్డ్ తో సంభంధాలున్నాయని భరత్ షా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.