నిఖితపై బ్యాన్ ఎత్తకపోతే పోరాటం చేస్తాం
నటి నిఖితాపై నిర్మాతల సంఘం మూడేళ్ల పాటు నిషేధం విధించడం తొందరపాటు చర్యగా నటి తారా అభిప్రాయపడ్డారు. స్థానిక రాజీవ్‌గాంధి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు దర్శన్‌ను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంబరీష్ బెంగళూరు వచ్చిన తరువాత కళాకారుల సంఘంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్నారు. అంతేకాకుండా నిర్మాతల సంఘంతోనూ మాట్లాడుతానన్నారు. చలన చిత్ర పరిశ్రమలో తనకంటే చిన్న వాడైన దర్శన్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, భార్యపై అతను ఇంత క్రూరంగా ప్రవర్తించాడని తెలిసి బాధపడ్డాను, అసహ్యించుకున్నాన న్నారు. దర్శన్ దాంపత్య జీవనంలో వచ్చిన గొడవ సుఖాంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. భార్య, భర్తల మధ్య గొడవను మీడియా ఇంతదాకా తీసుకెళ్ళకుండా ఉండాల్సిందన్నారు. నిఖితా తప్పు చేసి ఉంటే ఆమెను పిలిచి మందలించి ఉండాల్సిందని, ఏకా ఏకీ ఆమెపై నిషేధం వేయడం సరైన విధానం కాదన్నారు. తక్షణం నిషేధాన్ని ఉప సంహరించుకోకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. మహిళలపై పురుషల దౌర్జన్యం రోజు రోజుకు పెరుగుతోందనేందుకు దర్శన్ ఉదంతమే నిదర్శనమన్నారు.
కన్నడ నటుడు దర్శన్ వివాదంలో కీలకంగా భావిస్తున్న నటి నిఖిత ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు. దర్శన్ కుటుంబంలో తగాదాలు రావడానికి నటి నిఖిత అన్న అనుమానంతో ఆమెపై కన్నడ చిత్రపరిశ్రమ మూడేళ్లపాటు నిషేధం విధించింది. అయితే ఆమె తండ్రి కొద్ది నెలల క్రితమే మరణించడం, దానికి తోడు ఈ వివాదంలో ఇరుక్కోవడంతో నిఖిత మానసికంగా ఒత్తిడికి లోను కావడంతో ఆమెను బంధువులు ఆస్పత్రిలో చేర్చారని కధనాలు వస్తున్నాయి.కాగా భార్యతో ఘర్షణపడిన నటుడు దర్శన్ జైలుపాలైన సంగతి తెలిసిందే.ఇక కన్నడ నటుడు దర్శన్ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి నిఖితపై కన్నడ చలన చిత్ర నిర్మాతల సంఘం మూడేళ్ళ పాటు నిషేధం విధించింది. విజయలక్ష్మి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తమ కుటుంబంలో గొడవలకు నటి నిఖితే కారణమని ఆరోపించిన నేపథ్యంలో నిర్మాతల సంఘం ఆదివారం సమావేశమై నిఖితపై మూడేళ్ల పాటు నిషేధం వేటు వేసింది.


Click it and Unblock the Notifications











